మనిషి మనిషికి మనసంట
మనసు మనిషి వేరువేరంట
మనిషి మనిషికి పేరంట
పేరు పేరు అవి వేరంట
పేరు లేని మనిషి లేరంట
మనసు లేని మనిషి వేరంట
మనిషిలో మనసు ఉన్నా
అది పైకి ఎప్పుడు కనిపించదంట
మనిషికి మనసుకు సరిపడదంట
లోలోన ఏదో ఒక తెలియని వారంట
మనిషికి మనసే తోడంట
అవి ఎప్పుడు వేరుగా లేవంట
అలసిన మనిషికి నిట్టూర్పంట
మనిషికి మనసే ఓదార్పంట
మనసుకు మనిషి చెలిమి అంట
మనిషరికి మనసే కలిమి అంట
మనసే కోరికల చెలిమే అంట
మనిషి ఆశలకు ఊట అంటా
నింగి నేలకు అందని దంట
ఆ అందని నింగిని
నేల వైపుకు వంచింది మనసే నంట
-పి.బక్కారెడ్డి
9705315250