‘‘కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’
యాంత్రికయుగం రాక ముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు.అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించు కు న్నాడు. యాంత్రిక యుగంలో క్యాపి టలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందు వల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. మరోవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులకు నిర్దేతమైనవని గంటలు వుండేవికావు. వాళ్ళు రోజుకి 16 నుండి 18 గంటలు పనిచేయాల్సి వచ్చేది. దీనితో అమెరికాలోని చికాగో పట్టణంలో 1884లో కార్మికులు రోజుకి 8 గంటలు మాత్రమే పని వుండాలని ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన 1886 నాటికి తారాస్థాయికి చేరింది. మే 1, 1886 న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలు పెడితే 3 మే నాటికి శ్రామికుల సంఖ్య లక్ష మందికి చేరుకుంది. ‘‘హేమార్కెట్ దారుణ హత్యాకాండ’’ ఉదంతాన్ని ప్రదర్శనలు, 66 దేశాలలో ఆందోళనలు చేసి, 8 గంటల పనిని కార్మికులు పోరాడి సాధించుకున్నారు. ఆ విజయానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున జరుగుతుంది. 1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. భారతదేశంలో శ్రామికులకు రోజుకు 8 పని గంటలు ప్రవేశ పెట్టడానికి, స్త్రీ పురుషులకు ఒక పనికి సమాన వేతనం ఇవ్వడానికి డా. బి.అర్. అంబేద్కర్ మూల కారణం.
కొరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితిలో ప్రభుత్వాలు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో ఆఫీసుకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్లకు మాత్రం బయట పరిస్థితి ఎలా ఉన్నా.. వెళ్లక తప్ప లేదు.కానీ ఐటి వాళ్లకు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంట్లోంచే పని చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఐటి రంగంలో పనిచేస్తున్న వారికి భారీ ఊరట లభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటి కంపెనీలు ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీకి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ పంపిస్తున్నాయి.
ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. మిగిలినవారిని రప్పించేందుకు కొన్ని కంపెనీలు ఈ బహుమతుల పద్ధతి ఎంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులను ఒక్కసారిగా కార్యాలయాలకు రప్పించుకుండా హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను (వారంలో 2, 3 రోజులు ఆఫీసుకు) అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల కోసం విభిన్న వర్క్ మోడ్స్‌ను ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు. ‘‘ఎక్కడి నుంచి పని చేస్తే ఎక్కువ సృజానత్మకంగా, ప్రొడక్టివ్‌గా ఫీల్ అవుతారో అక్కడి నుంచే పని చేయవచ్చు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని కనుక కంపెనీలు ఓపెన్ చేయడానికి ఇదే సరైన సమయమని,టెక్ దిగ్గజం గూగుల్ రెండేళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆఫీసులను తెరుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీసును ప్రారంభిస్తోంది. ఏప్రిల్ 4 నుంచి ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసేసింది. ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తోన్న కంపెనీలు,100 శాతం వ్యాక్సినేటెడ్ అయిన వారినే లోపలికి అనుమతిస్తామని కూడా స్పష్టం చేసింది.
కొరోనా ఇచ్చిన వెసలుబాటుతో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్ బై చెప్పేసి హైదరాబాద్‌కు ‘క్యూ’ కడుతున్న ఐటీ ఉద్యోగులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇళ్ల యజమానులు అమాంతం అద్దెలు పెంచేశారు. దీంతో సగం జీతం అద్దెలు కట్టడానికి అయిపోతోదంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానులు తాము అడిగినంత ఇస్తేనే ఇళ్లు అద్దెకిస్తామని తెగేసి చెబుతున్నారు. ఏలాగైనా ఆఫీస్ కి రప్పించాలన్న ఉద్ధ్యేశంతో వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో సిటీ విడిచి ఊళ్లకు వెళ్లిన వారు మళ్లీ ఇక్కడ కొత్త ఇళ్లు వెతుక్కోవడానికి ఇబ్బందులు పడొదన్న ఉద్దేశంతో తాత్కాలికంగా వసతి ఏర్పాట్ల ఖర్చును భరిస్తున్నాయి. అలాగే లొకేషన్ బోనస్‌లు, ప్రత్యేక సెలవులు ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ మినహాయించి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు 15-20 రోజుల వరకూ ఉచిత వసతి ఇస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఉండేందుకు వీలుగా సర్వీస్ అపార్టుమెంట్ల లోని ఫ్లాట్లలో వసతి కల్పిస్తున్నాయి. కొన్ని ఐటీ సంస్థలు అద్దె ఇళ్లు వెతుక్కునేందుకు ప్రత్యేక సెలవులు ఇస్తున్నాయి.
‘రీ లోకేషన్ బోనస్’ పేరిట అదనంగా కొంత భత్యం చెల్లిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆర్థిక భారం కాకుండా సొంతూళ్ల నుంచి సామగ్రి సహా వచ్చేందుకు రవాణా ఖర్చుల కోసం ఈ భత్యాన్ని చెల్లిస్తున్నాయి. సంస్థ స్థాయిని బట్టి ఇది రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. మరోవైపు ఐటీ ఉద్యోగినుల పిల్లలకు ‘డే కేర్’ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆఫీసు పక్కనున్న అపార్టుమెంట్లలోనో లేదా కార్యాలయం ఆవరణలోనో ఇవి ఏర్పాటు చేస్తున్నాయి. ‘బ్యాక్ టు ఆఫీస్’ పేరిట బహుమతులు కూడా ఇస్తున్న సంస్థలున్నాయి. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. కార్మిక హక్కులను కాల రాస్తున్నారు. కాబట్టి మే దినోత్సవ ప్రాముఖ్యతను మరోసారి గురు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నది.1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. అమెరికాలో వున్న ప్రజాచైతన్యం కార్మిక చట్టాలు అమలు కానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు వెట్టి చాకిరి చేయిస్తున్నారనే విమర్శ ఉంది.