న్యూ దిల్లీ ,మే23:: దేశంలో కొత్తగా 2022 మందికి కొరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కొరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 46 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని
తెలిపింది.
ఇప్పటివరకు 1,92,38,45,615 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో ఆదివారం ఒకేరోజు 8,81,668 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది. కాగా, దేశంలో మొదటిసారిగా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లయిన బీఏ.4, బీఏ.5 ఉనికిని గుర్తించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ తరహా కేసులు రెండు నమోదయ్యాయని వెల్లడించింది. తమిళనాడుకు చెందిన 19 ఏండ్ల యువతిలో బీఏ.4 వేరియంట్ బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ఆమె పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్నదని, ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పారు.