జిన్‌పింగ్.. నాకు మంచి స్నేహితుడు

– ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పొగడ్తలు

బీఇంగ్, మే 14 : చైనా అధినేత జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య గురువారం బీజింగ్‌లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బృందాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను కలవడం తనకు గౌరవమని, ఆయన తనకు మంచి స్నేహితుడని కొనియాడారు. ఇరు దేశాలకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు. ‘మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. పొరపొచ్చాలు వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుని త్వరగా పరిష్కరించాం.. మీరు ఒక గొప్ప నాయకుడు. నేను మిమ్మల్ని ప్రశంసించడం కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను.. చైనా, అమెరికాలు కలిసికట్టుగా అధ్బుత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాయి’ అని అన్నారు. ఈ పర్యటన కోసం తాను అమెరికాకు చెందిన అత్యుత్తమ వ్యాపారవేత్తలను తీసుకొచ్చానని కూడా ట్రంప్ చెప్పారు. వారందరికీ చైనా అధినేత అంటే గౌరవమని అన్నారు. ఇదే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశమని కూడా వ్యాఖ్యానించారు. సమావేశం ప్రారంభంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని అభిలషించారు. చైనా`యÖఎస్ బంధం స్థిరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం దృష్టి తమ రెండు దేశాలపైనే ఉందన్నారు. గత శతాబ్దంలో చూడని మార్పులు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని, ప్రపంచం నాలుగు రోడ్ల కూడలిలో ఉందని అభిప్రాయపడ్డారు. చైనా, యూఎస్‌లు తమ దౌత్య బంధంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కూడా వ్యాఖ్యానించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో ఎన్‌విడియా సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాల్గొంటున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, టెక్నాలజీతోపాటు తైవాన్ అంశంపై కూడా చర్చించేందుకు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాసింజర్ విమానాలను చైనాకు మరింతగా ఎగుమతి చేసేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *