– ఇంధన పొదుపు కోసం రెండు కార్లతో మోదీ పయనం
న్యూదిల్లీ, మే 13 : ప్రధాని మోదీ చెప్పినట్లుగానే తన భద్రతా కాన్వాయ్‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ఇంధనం పొదుపు కోసం తన కాన్వాయ్‌లో 50 శాతం వాహనాలను తగ్గించాలని ఆదేశించిన కొద్దిగంటల్లో అమలు చేశారు. దిల్లీ వీధుల్లో ప్రధాని మోదీ కాన్వాయ్‌లో రెండు వాహనాలు మాత్రమే కనిపించడం చర్చనీయాంశమైంది. వీటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇరాన్`ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ఏడాదిపాటు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆదేశించారు. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లోని కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని ప్రధాన మంత్రి సూచించారు. ఇందు కోసం కొత్త వాహనాలను కొనొద్దని స్పష్టం చేశారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఎంపీ సీఎం మోహన్ యాదవ్ సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. అనవసర ప్రయాణాలను తగ్గించాలని, జాతీయ వనరులను పరిరక్షించాలని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చిన క్రమంలో బాధ్యతాయుతమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిపాలనాపరమైన పొదుపు చర్యలు చేపట్టడం వంటి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యను పరిగణిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





