నీచమైన మనసెపుడు నిగూడంగానే దాగుంటది
పై మెరుగుల్లో మాత్రం
సమైక్య జీవనసూత్రం
సోదరబావం సౌభ్రాతృత్వం
అంతకుమించి
సమానత్వం
ఇదేనేమో భారతీయ ఆంతరంగిక చిత్రం
దళితుల జీవనగమనం
అణిగిమణిగి ఓ వైపలా…
మహనీయులక్కూడిక్కడ
అవమానాల తోరణాలే
కాలమెంతమారినా
కులరాజకీయనాయాళ్ళు
సందుదొరికితే చాలు
వేలెత్తి నోరెత్తి దేశానికేదో
సునామొచ్చినట్లు స్వార్థపువిషాన్ని సమాజంలో
రాజేస్తుంటరు వెర్రెధవలు
విశ్వజ్ఞానీ అంబేద్కర్
విశ్వశాంతికోసముదయించిన
వేలకోట్ల వెలుగతడు
బహుజనులు దీనులు దరిద్రులను స్త్రీలను
అణచబడ్డ ప్రతివారిని నిలబెట్టిన నిజమైన మానవతావాది
భారతదేశం నేడింతలనైన
ముందుకెలుతుందంటే
కారణమతడే
గల్లికో జిల్లాకో పేరుపెట్టుడుకాదు
దేశానికే గర్వకారణం ఆయన
అంబేద్కర్ భారతదేశమని
పేరెట్టండి
దేశానికి దిశానిర్దేశం చేసిన
దిక్సూచి అంబేద్కర్
– సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,