తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్ టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని వెల్లడింది. ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్ర నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కిషన్‌రెడ్డి ప్రకటనను విడుదల చేశారు.
- రైతులపట్ల బీజేపీకున్న చిత్తశుద్ధికి నిదర్శనం
- ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ధన్యవాదాలు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
రాష్ట్రంలో మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు (ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్) బియ్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రైతుల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని గురువారం విడుదల చేసిన ప్రకటనలోహొ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లకు బండి సంజయ్ ప్రత్యేకహొ కృతజతలు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రం నుండి 6.05 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం సేకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. ఇకపై ఉప్పుడు బియ్యం (పారాబాయిల్డ్ రైస్ ) కేంద్రానికి పంపబోమని కేసీఆర్ ఫ్రభుత్వం గతంలో హామీ ఇచ్చి ఒప్పంద పత్రాలపైహొ సంతకాలు కూడా చేసిన మాట తప్పడమే కాకుండా కేంద్రాన్ని బదనాం చేసేందుకు యత్నించిన గుర్తు చేశారు.ధాన్యం కొనుగోలు విషయంలో, ఉప్పుడు బియ్యం సేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని డ్రామాలుహొచేసిన ప్పటికీ బీజేపీ మాత్రం రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందనడానికి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయమే నిదర్శమని పేర్కొన్నారు.