– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వమంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే దమ్ము లేకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లు ఫామ్‌హౌస్‌లో పడుకుని ఇప్పుడు మళ్లీ కేసీఆర్ మో{ర్లకు మీటర్లు అంటున్నారని కేంద్ర మంత్రి సెటైర్ విసిరారు. పదేళ్ల నుంచి అదే పాట పడుతున్న కేసీఆర్ ఒక్కరోజూ దాన్ని నిరూపించలేకపోయారని విమర్శించారు. మైక్ దొరికితే ఆయనంత మేధావి ఎవరూ లేరని కేసీఆర్ అనుకుంటారన్నారు. ఆర్టీసీ కార్మికులకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క జీవోతో వాళ్ల సమస్యలు పరిష్కారం అయ్యేవని, కానీ ఆర్టీసీ కార్మికులను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




