– అందజేసిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి గురువారం నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు సెంట్రల్ ఫ్లాగ్ ఫండ్ నుంచి నగదు పురస్కారాలను అందజేశారు. ప్రథమ విజేతలకు రూ.20,000, ద్వితీయ విజేతలకు రూ.15,000, తృతీయ విజేతలకు రూ.10,000 చొప్పున బహుమతులు ఖరారు చేశారు. విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేటగిరీ-1 (పీసీ నుంచి ఏఎస్ఐ వరకు)
పని ప్రదేశాల్లో లింగ వివక్ష అనే అంశంపై నిర్వహించిన ఈ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌కు చెందిన ధసరి ప్రశాంత్, కావేరి దీపిక ప్రథమ బహుమతి సాధించారు. కరీంనగర్ పీటీసీకి చెందిన కె.రవికుమార్, ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌కు చెందిన ఎ.రాజు ద్వితీయ, కరీంనగర్ జిల్లా చొప్పదండి పీఎస్‌కు చెందిన పి.స్వర్ణలత, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎ.శ్రీలత తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.
కేటగిరీ-2 (ఎస్ఐ ఆపై స్థాయి అధికారులు)
అట్టడుగు స్థాయి పోలీసింగ్‌ను బలోపేతం చేయడం అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో ములుగు జిల్లా ఆరఐ వెంకట నారాయణ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డబ్ల్యూపీఎస్ ఎసఐ వై.మౌనిక ప్రథమ స్థానంలో నిలిచారు. వరంగల్ పీటీసీ ఇన్‌స్పెక్టర్ కె.అశోక్ కుమార్, ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్ ఆరఎసఐ ఎన్.వి.ఆర్.చౌదరి ద్వితీయ, సీఐడీ ఎస్ఐ ఖాజా హఫీజున్నీసా బేగం, జోగులాంబ గద్వాల భరోసా కేంద్రం ఎస్ఐ బి.తారక తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఐజీపీ గజరావు భూపాల్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




