రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కేసీఆర్‌కే సాధ్యం

– మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి

రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కుట్రలు, కుతంత్రాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే కేసీఆర్ లక్ష్యమని బీఆరఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన జగిత్యాల సభ సమాజానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. రేవంత్ రెడ్డి పోవాలె..కేసీఆర్ రావాలె అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యావత్ తెలంగాణ ప్రజలకు జీవధార అని, హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టు అని అన్నారు. కేసీఆర్, హరీష్‌రావు, అధికారులను కేసులో ఇరికించాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. ప్రతి రోజూ రేవంత్ రెడ్డికి కలలో కేసీఆర్ కనపడుతున్నాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *