వివరాలును గవర్నర్‌కు అందచేసిన పోలీసులు
ప్రజాతంత్ర, కామారెడ్డి, ఎప్రిల్ 23 : జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు, పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న విమర్శలపై గవర్నర్ ఆరా తీశారు.
లొంగిపోయిన ఆరుగురు నిందితులపై 216,306,34 సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీ, పోలీసులు నిర్దారించిన దర్యాప్తు వివరాలు, రిమాండ్ రిపోర్ట్‌లను గవర్నర్ తమిళి సైకి జిల్లా పోలీస్ శాఖ నివేదించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఏ7 గా ఉన్న సీఐ నాగార్జున గౌడ్(తుంగతుర్తి)ను పోలీసులు విచారించారు. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.