తడిసిన ధాన్యం కూడా కొంటాం

  • కేంద్రం కొన్నా కొనకున్నా చివరి గింజ వరకూ సేకరిస్తాం
  • రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం
  • ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం
  • ప్రగతి భవన్‌ ‌సవి•క్షలో సిఎం కెసిఆర్‌ ‌కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని సీఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. వర్షాకాలం సవి•పిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలని అధికారులను పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతితో పాటు పలు విషయాలను అధికారులను అడిగి కేసీఆర్‌ ‌తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా.. తడిసిన ధాన్యంతో పాటు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ ‌రైస్‌ను కూడా ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ‌స్వష్టం చేశారు.

రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం..ఎంపిక చేసిన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా గ్రావి•ణ క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించు కొని జూన్‌ 2‌న ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రావి•ణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల గ్రావి•ణ క్రీడా కవి•టీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కవి•టీలు పనిచేస్తాయని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page