జనరంజక పాలకులు కాకతి ప్రభువులు

‘‘700 ‌సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసి ద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యా టకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయట ంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేశారు.’’

నేటి నుండి 13 వరకు కాకతీయ వైభవ సప్తాహం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కాకతీయ సప్తాహం పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించ నున్నారు. ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఐదు సార్లు కాకతీయ ఉత్సవాలు నిర్వహిం చగా, చివరి సారిగా 2012-13లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాకతీయ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. శాతవాహనుల అనంతర కాలంలో తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీ యులు. క్రీ. శ. 950 – 1100 మధ్య కాలంలో కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులకు, లేదా పశ్చిమ చాళుక్యులకు లేదా తూర్పు చాళుక్యులకు (దశలను బట్టి) సామంతులుగా, ఉద్యోగులుగా ఉండేవారు. రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాల లో ప్రశంసనీయమైన పాత్ర వహిం చి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్థులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరు వాత కాకతీయ సామ్రాజ్యం నేటి చత్తీస్‌ ‌ఘడ్‌ ‌రాష్ట్రంలోని బస్తర్‌ ‌నుంచి మొదలుకొని కర్ణాటక లోని బీదర్‌ ‌వరకు, కళింగ నుంచి మొదలుకొని విక్రమ సింహపురి వరకు ఓరుగల్లు రాజధానిగా విస్తరించ బడింది.  ఆంధ్ర శాతవాహనుల తర్వాత విడిపోయిన తెలంగాణ, కోస్తా, రాయల సీమ ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన మొదటి రాజ వంశీయులు కాకతీయులు. కాకతీ యుల పరిపాలకుల్లో రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ముఖ్యులు. మంచి పరిపాలనా దక్షులు.
తెలంగాణ ప్రాంతాన్ని క్రీపూ 750 నుంచి 1323 వరకు జనరంజకంగా పరిపాలించిన రాజవంశం కాకతీ యు లు. ఆంధ్రదేశాన్నంతటినీ ఏక తాటిపైకి తెచ్చి పరిపాలించిన సమ ర్థులు. వీరికి ఆంధ్ర దేశాదీశ్వర అనే బిరుదు ఉంది కాకతీయుల కుల దేవత కాకతి ఆరాధకులు కాబట్టే వారు కాకతీయులు అయ్యారని చరిత్ర కారుల అభిప్రాయం. 700 సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసి ద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యా టకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయట ంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేశారు.
image.png
స్వల్పకాలిక విరామం తర్వాత ప్రభుత్వం తిరిగి కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. 2022 జూన్‌ 5‌న ప్రగతి భవన్‌ ‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాకతీయ వైభవ సప్తాహం వాల్‌ ‌పోస్టర్‌ ‌ను ఆవిష్కరించారు. 2022 జూలై 3న ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌ ‌కాన్ఫరెన్స్ ‌హాలులో నిర్వహించిన సమావేశంలో  ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో ఉత్సవాలు నిర్వ హించాలని నిర్ణయించ బడింది. కాకతీయ వంశం, చరిత్ర, ఇక్కడి ప్రాంతాలపై అవగాహన ఉన్నవాళ్ళతో ఉత్సవాలకు కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 7 రోజుల పాటు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో సాంస్కృతిక ఉత్సవంగా 2022 జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టతను, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. ఈ సప్తాహాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించింది.
ఒకప్పటి మహా సామ్రాజ్యపు వారసుడు కమల్‌ ‌చంద్ర భంజ్‌ ‌దేవ్‌ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రానున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాసర్‌ ‌నేతృత్వంలో ఉత్సవ కమిటీ రూపొందించి ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం లోని బస్తర్‌ ‌వరకు వెళ్లి 22వ తరం వారసులు కమల్‌చంద్‌ ‌భంజ్‌దేవ్‌ ‌ను స్వయంగా కలిసి కాకతీయ సప్తాహం పేరుతో జరుగుతున్న కాకతీయ ఉత్సవాలకు ఆహ్వానిం చారు. కాకతీయ వారసుడు కమల్‌ ‌చంద్ర భంజ్‌ ‌కు 111 మంది పేరిణి కళాకారులతో స్వాగత కార్యక్రమం, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన అన్నివర్గాల మేధావులు, కవులు, సాహితీ వేత్తలను గౌరవించు కోవడం, సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలు, మేథో చర్చల నిర్వహణ, వరంగల్‌ ‌పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతా వరణం నెలకొనేలా విద్యుత్‌ ‌దీపాలతో అలంకరించడం, కాకతీయుల వైభవంపై ఎన్‌ఐటీ, కాకతీయ, కాళోజీ హెల్త్ ‌యూని వర్సిటీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించడం తదితర కార్యక్రమాలకు రూప కల్పన చేశారు.
The Janaranjaka rulers were Kakati lords
టార్చ్ అనే స్వచ్ఛంద సంస్థ కాకతీయులపై గత కొన్ని నెలలుగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థ కాకతీయుల నిర్మాణాలపై సేకరించిన 700 చిత్రాలతో ప్రదర్శన, ఇంకా కాకతీయుల వైభవాన్ని చాటిచెప్పే అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తు న్నారు. ఉత్సవాలను హనుమ కొండతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page