చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

కోత్‌కతా ఘటన ఓ గుణపాఠం కావాలి!

మనదేశంలో మహిళను  గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు వెళుతున్నాం. నిజంగానే మన చట్టాలను కఠినతరం చేసుకోవాల్సి ఉందని వరుస  ఘటనలు మనలను హెచ్చరిస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడినవారిని వారంలోగా బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి పాలకుల వరకు ఇదే చెబుతున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ముందుంచారు. నిజంగానే ఉరిశిక్ష  విధించాల్సిందే. అప్పుడే మృగాళ్లకు భయం పుడుతుంది.  అత్యాచారం చేయాలంటేనే వణికి పోయేలాగా మన చట్టాలను కఠినం చేసుకోవాల్సిన అసవరాన్ని తాజాగా కోల్‌కతా ఘటన చెబుతోంది. కొంతమంది గ్యాంగుగా అభయను చెరిచి హత్య చేశారు. అందులో ఓ మహిళా స్నేహితురాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాచారం చేసిన వారికి ఆమె సహకరించినట్లు సోషల్‌ విరీడియా కోడ్కె కూస్తోంది.

 

కానీ ఒక వ్యక్తిని బలిచేసి అతడి చుట్టూ నాటకాన్ని తిప్పుతున్నారు. ఇంతగా అధికార యంత్రాంగం ఉన్న మనదేశంలో అక్కడ ఏం జరిగిందో గుర్తించి ఇంకా శిక్షించలేక పోతున్నాం. ఉరిశిక్ష వేయాలంటున్న మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నా…ఏవిరీ చేయలేకపోతున్నారు. శారీరకంగా పురుషుడి కంటే బలహీనురాల్కెన స్త్రీని మృగాళ్లు వెన్నాడుతున్నా..ఇంకా చూస్తూ కూర్చోవడం సరికాదు. నీతి వాక్యాలు పలుకుతున్న పాలకులు వెంటనే తగిన చొరవ తీసుకోవాలి. కోత్‌కతాతో ఇక గుణపాఠం కావాలి. దేశానికి ఒక సందేశం వెళ్లాలి. అత్యాచారం అంటే జడుసుకునేలా..ప్రాణాలు వదులు కోవాల్సిందే అన్న రీతిలో కఠిన శిక్షలు పడాలి. లింగ సమానత్వం గురించి  మాట్లాడుతున్న వారు మృగాళ్ల గురించి మాట్లాడాలి. ఏ నేరానికైనా ముఖ్యంగా స్త్రీల విరీద, బలహీనవర్గాల విరీద జరిగే అకృత్యాలకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. చిన్న, పెద్ద ఏ నేరాల్కెనా భయపెట్టే శిక్షలు, వాటి అమలు సరిగ్గా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది.  ఎలాంటి కేసులో అయినా ఒక్క నేరస్థుడు కూడా తప్పించుకోలేడన్నట్లుగా చట్టాలు, న్యాయవ్యవస్థ  ఉండాలి.  నేరస్థులకు ఉరిశిక్షలు అమానవీయం అని చెప్పేవాళ్లను బహిష్కరించాలి. అలా అయితే మరి అమాయకులను చంపడం అమానవీయం కాదా అన్నది చర్చించాలి.  30 ఏండ్ల కిందట గుంటూరు దగ్గర దుండగులు బస్సుకు నిప్పు పెట్టిన సంఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. ఆ దుండగుల న్యాయవాది వారిని ఉరి తీయకూడదని వాదించాడు.

 

న్యాయానికే వారికి శిక్ష వేసే హక్కు లేనప్పుడు, పక్కవారిని చంపే హక్కు సామాన్యులకు ఉందా? బతికే హక్కు దుండగులకే ఉంటే మరి ఆ 27 మందికి బతికే హక్కు లేదా? ఇటువంటి వెర్రివాదనలు పక్కనపెట్టి శిక్ష రుజువైన ప్రతివారికి ముఖ్యంగా అత్యాచారం, హత్య వంటి సందర్భాలలో ఉరిశిక్షనే ఖరారు చేయాలి. ఒకసారి ఉరిశిక్ష పడ్డాక అతడిపై మళ్లీమళ్లీ విచారణ జరపకుండా చూడాలి. ఇటువంటి నేరస్థులు ఎంతమందయినా వెరవాల్సిన పనిలేదు. ముఖ్యంగా నేరచరిత్ర ఉన్నటువంటి రాజకీయవేత్తలను, నేరచరిత్ర ఉన్న రాజకీయ నాయకులను కూడా ఉరితీయాల్సిందే. అలాంటి వారు పాలకులు అయితే శిక్షలు పడొద్దని కోరుకుంటారు.  కలకత్తాలో నిరసన తెలుపుతున్న బీజేపీ వారు గురివింద గింజల్లా ప్రవర్తిస్తున్నారు. నిందితులెవరైనా కఠిన శిక్షలుంటేనే న్యాయం, ధర్మం పాటింపబడతాయని గ్రహించాలి. మానవత్వం కంటే, శిక్షలే ముఖ్యమని గుర్తించాలి. కసబ్‌ లాంటి వాడిని మేపి, ఏళ్లు కాలం గడిపి ఘనంగా మన న్యాయవ్యవస్త ఉందని చాటుకోవాల్సిన పనిలేదు. వెంటనే ఖతం చేయడమే శిక్షగా చూడాలి. దేశంలో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాల కేసుల్లో కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయంటే మన నేర ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో గమనించాలి. అత్యాచారాలు చేసిన 72 శాతం నిందితులు నేర వ్యవస్థలో డొల్లతనాన్ని అసరాగా చేసుకొని నిర్ధోషులుగా బయటపడు తున్నారు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా రేప్‌ కేసును చేపట్టడంలో మొదటి నుంచి జరిగిన తప్పులు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది.

 

అత్యాచార నిందితులకు సకాలంలో శిక్షలు పడకపోవడం వల్లనే కోల్‌కతా ఘటన జరిగిన వెంటనే దేశం యావత్తూ ఆందోళనకు దిగింది. చివరకు మమతాబెనర్జీ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు దారి తీస్తున్నాయి. అలాగే  ఏటా 30,000 కు పైగా అత్యాచారాలు జరుగుతున్నట్లు గణాంకాలు చూస్తుంటే ఆందోళన కలిగించే విషయమే కాకుండా, నేర న్యాయవ్యవస్థలోని పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, కోర్టులు, జ్కెళ్లుఈ నాలుగు విభాగాల పనితీరు లోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది.  దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక బాలికపై అత్యాచారం జరిగిందని తెలుసుకోవచ్చు. ఇన్ని జరుగుతున్నా నేరవ్యవస్థలోని నాలుగు విభాగాలు పోలీస్‌, ప్రాసిక్యూషన్‌, కోర్టులు, జ్కెళ్లు త మ విధుల్లో సామూహిక వైఫల్యం చెందితే నేరస్థుల హృదయాల్లో శిక్ష అంటే ఏమాత్రం భయం ఉండడం లేదు. దర్యాప్తు ప్రారంభదశలో నేరం నమోదు ఆలస్యమైతే తప్పు చేసినట్టే.

 

కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు 14 గంటలు ఆలస్యమైంది. అంతేకాకుండా కైమ్ర్‌సీన్‌ను రక్షించ కుండా ధ్వంసం చేశారు. దీంతో అనేక అనుమానాలు పెరిగి దర్యాప్తునే శంకించ వలసిన పరిస్థితి ఏర్పడిరది.  బద్లాపూర్‌ కేసులో కూడా ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్న తరువాత పోలీస్‌లు దర్యాప్తుకు రంగంలో దిగారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో వాంగ్మూలాలు రికార్డు చేయడంలో విపరీతమైన జాప్యం చేయడంపై బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్ష అమలులో విపరీతమైన జాప్యం చేస్తే బాధితులకు సకాలంలో న్యాయం అందించలేని వారవుతారు. అందుకే అత్యాచార కేసుల్లో ముందుగా కఠిన శిక్షలకు పూనుకోవాలి. వారం పదిరోజుల్లోగా కేసులను తేల్చేసి దోషులను బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచార నిందితుడి ఆస్తులు లాగేసుకోవాలి. ఇలా కఠన శిక్షలు అమలు జరిగితే తప్ప దేశంలో ఇలాంటి అరచాకాలను అడ్డుకోలేం.
-ఎం. అజయ్‌కుమార్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page