చరిత్రలో
నేటి రోజుల పేజీల్ని
చింపేయండి!
మతపిశాచుల శాసనాలను ధ్వంసం చేసి
ఐక్యతా గీతాన్ని
ఆలపించండి !
మతమంటూ విధ్వంసం సృష్టిస్తే
నడిబజారు ఊరికొయ్యాలకు
వ్రేలాడ కట్టండి !
అలముకున్న అంధకారాన్ని తగలబెట్టండి .
ఆలస్యం చేస్తే –
జీవించే హక్కును
జన్మించేహక్కును లేకుండా చేస్తుంది!
చెంరచబడ్డ చెరచబడ్డ వారి
సాక్షిగా ఐక్యతా లేవదీసి
రాజ్యాంగంలోని అక్షరాలకు
ప్రాణం పోయంది !
గాయంకుళ్లిన దేశానికి
శస్త్రచికిత్స చేయండి
పింజారుల పాలనకు
పంచనామా రాయండి !
మెదళ్లకు ఎక్కిస్తున్న విషాన్ని
తొలగించి మానవత్వాన్ని నింపింది …..!!
శోభరమేష్
8978656327