జోరు వానలో ఇంటిపట్టునే ఉండగలిగేది ఎందరు?
మండుటెండలో నీడ పట్టును సేద తీర గలిగే వారెందరు?
ఎముకలు కొరికే చలిలో వెచ్చగా పడుకోగలిగేదెందరు ?
కష్టం సుఖం ఇష్టంతో నిమిత్తం లేకుండా
భార్య పిల్లలు సుఖం కోసం
యంత్రాలతో పోటీపడే వారెందరు?
భార్యాపిల్లల సంతోషాలు కోరికలే తన సంతోషాలుగా
వారి చిన్ని చిరునవ్వుతో తమ కష్టాన్నంతా
మర్చి పోయి
తన వాళ్లే తన లోకంగా
ఇంటింటికీ ఒకరు త్యాగమూర్తులై
భార్య పిల్లల ప్రేమ ఆప్యాయత అనురాగాలే
ప్రతిఫలంగా వారు ఆశించేదే వారే
ఎవరి బ్రతుకులో నైనా ఘనులు.
…..శశి
9553809850.