పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశంస
బూర్గంపాడు, జూన్ 03(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్ కోర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత విలేఖరితో ముఖాముఖిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్ర కీలకపాత్ర పోషించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక తెలంగాణ తొలి పత్రికగా నడుపుతున్న ఎడిటర్ దేవులపల్లి అజయ్‌ను ఆయన అభినందించారు.
ప్రజాతంత్ర పత్రికకు, యాజమాన్యానికి తనకున్న అనుబంధాన్ని కొద్దిసేపు గుర్తు చేసారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు పన్నిన ఆ కుట్రలను తిప్పికొట్టి ఉద్యమానికి ఊతమిచ్చిన తొలి తెలంగాణ పత్రిక ప్రజాతంత్ర అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందుండి పోరాడిన దేవులపల్లి అజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.