- రెడ్డి కులం కాదు.. టైటిల్ మాత్రమే
- అందరినీ ఆదుకుని బువ్వపెట్టే కులం: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్,మే23: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…వ్యంగ్యాస్త్
ఆదుకునే గుణం, సేవా చేసే తత్వం ఉన్నది రెడ్డి కులానికి ఉందని.. అందుకే సమా జంలో రెడ్డి కులం ఈ రోజుకి గౌరవింప బడుతుం దన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, జైపాల్ రెడ్డి లాంటి వాళ్లు కష్టపడి, కృషిచేసి రెడ్డి సమాజం గౌరవాన్ని పెంచారన్నారు. అంతేగాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అందరూ తప్పకుండా గుర్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009 ఎన్నికల్లో 33 ఎంపీ సీట్లను గెలిచి ఇచ్చింది కాబట్టే కేంద్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
రాజశేఖర్ రెడ్డి ఎలా లోకాన్ని విడిచిపోయారో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే వెళ్లిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులుగా ఉంటే 10 మందికి పైగా రెడ్డీలే ముఖ్యమంత్రులుగా ఉన్నారన్నారు. దీనికి కారణం గ్రామాల్లో భూమిని నమ్ముకున్న రెడ్లు వ్యవసాయాన్ని వదిలేయడమే కారణమన్నారు. వ్యవసాయం చేసే ప్రతి పేదవాడికి బువ్వ పెట్టారు కాబట్టే భూమిని నమ్ముకున్న రెడ్ల చేతుల్లో రాజ్యం ఉందన్నారు. ప్రతీ రెడ్డికి 5 ఎకరాలో, 10 ఎకరాలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రం, దేశం తమ చేతుల్లో ఉంటుందని..రాజ్యం, రాజకీయం రెడ్ల చేతుల్లో ఉంటుంద న్నారు. గ్రాణ ప్రాంతాల్లో రెడ్లు వ్యవసాయం వదిలేయడం వల్లే రెడ్లకు ప్రధాన్యత తగ్గిపోతుందన్నారు.
వ్యసాయాన్ని వదిలేయడం ప్రమాదకరమన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పేదలకు సాయం చేసి రెడ్ల గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. రెడ్లను నమ్ముకున్న వాళ్లు ఎవరూ మోసపోలే..నష్టపోలేదన్నారు. పార్టీలు గెలవాలంటే రెడ్ల చేతుల్లో పార్టీలు ఉండాలన్నారు. రెడ్లకు అవకాశమివ్వాలన్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టే పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ అన్నారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు.