‘‘ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్ గమనంలోకి తీసుకున్నట్టు లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ లో కౌంటర్ దాఖలు చేయడం ద్వారా కేంద్రం రెండు తెలుగు రాష్టాల్రకు అన్యాయం చేసింది.’’
దేశంలో నదులు అనేకం ఉన్నా..వాటి నీటిని సక్రమంగా వినియోగించుకోక పోవడంతో దేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాలు మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. నదుల అనుసంధానంపై జాతీయ విధానం లేకపోవడంతో ఇన్నేళ్లయినా నీటికటకటలు తప్పడం లేదు. ఈ దశలో కేంద్రం నదీజలాల పంపిణీని సీరియస్‌గా తీసుకోవాలి. ఇది జాతీయ సమస్యగా చూడాలి. తక్షణ సమస్యగా పరిగణించాలి. కావేరీ, కృష్ణా వివాదాలు ముదరక ముందే ఓ నిర్ణయం తీసుకుని జాతీయ జలవిధానానికి శ్రీకారం చుట్టాలి. భవిష్యత్ యుద్దాలకు అడ్డుకట్ట వేయాలి. తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా నదీజలాల లభ్యతను దృష్టిలో పెట్టుకుని అనుసంధానానికి పూనుకోవాలి. ఏటా వేసవి వస్తోందంటే మంచినీటికి కటకటలు తప్పడం లేదు. మంచినీటికి దిక్కు ఉండడం లేదు.
ఈ యేడాది భారీగా వర్షాలు కురిసినా ఇప్పుడు పల్లెలు, పట్టణాల్లో మళ్లీ నీటి కొరతకు సంబంధించిన ఆందోళనలు కానవస్తున్నాయి. నదీజలాల విషయంలో జాతీయ విధానం తీసుకుని రావడంలో పాలకులు విఫలమయ్యారు. దేశంలోని నదీజలాల లభ్యత, పంపకాలను పరిశీలిస్తే జాతీయ జలవిధానం అవసరమన్న విషయాన్ని కేంద్రం గుర్తించడం లేదు. ఈ దేశంలో ఉన్న జలాలపై దేశప్రజలందరికి సమాన హక్కులు ఉండాలి. రైతులకు సమాన వాటా రావాలి. ఎగువ రాష్టాల్రే నీటిని ఒడిసి పట్టుకుని దిగువ రాష్టాల్రకు మొండిచేయి చూపే విధానం పోవాలి. లేకుంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు రాగలవు. అలాగే నీటిని ఒడిసి పట్టే విధానాలు విస్మరించడం వల్ల ఏటా మంచినీటి కొరతలు వేదిస్తున్నాయి. దీంతో సాగు,తాగునీటికి ఏటా కటకట తప్పడం లేదు. జాతీయ జల విధానం రూపొందించి నదీ జలాల సమగ్ర వినయోగం జరిగివుంటే దేశంలో కరవు తాండవించేది కాదు.
ఇప్పటికే కావేరీ జలాల విషయమై కర్ణాటక, తమిళనాడు సిగపట్లు పడుతున్నాయి. తాజాగా విభజిత తెలుగు రాష్టాల్ర విషయంలో నదీజలాల వివాదం కొనసాగుతోంది. ఈ సమస్య రాగానే ఉభయ రాష్టాల్రు భగ్గుమంటున్నాయి. కృష్ణా నదీ జలాల పంపిణీలో ఉభయ తెలుగు రాష్టాల్రకూ అన్యాయం జరిగింది. కర్నాటక పైన ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు కట్టడంతో కిందికి చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడింది. వరదలు వస్తే తప్ప నీరు రాని దుస్థితి ఏర్పడింది. తాజాగా ఇప్పుడు కృష్ణాలో తాగునీటి అసవరాలకు కూడా నీరు అందని దుస్థితి ఏర్పడింది. ఈ రకమైన వివాదాల్ని మున్ముందు నివారించే దిశగా కేంద్రం, ట్రిబ్యునళ్లు సహకరించాలి. తుదితీర్పు వచ్చేలోగా తెలుగు రాష్టాల్రు సమర్థ వంతమైన వాదనతో తమ న్యాయమైన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరముంది.
ఇవన్నీ పరిష్కారం కావాల్సిన సమయంలో కేంద్రం కూడా సమభావనతో ఉండాలి. ఆల్మట్టి, నారాయణపూర్‌లను కట్టుకుని నీటిని వాడుకుంటున్న కర్నాటక తీరువల్ల కిందికి చుక్కనీరురాని పరిస్థితి ఏర్పడింది. అందుకే సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రస్తుతానికి అమల్లో ఉన్న బచావత్ కేటాయింపులను ప్రాజెక్టులవారీగా, రాష్టాల్ర వారీగా పుఃనపంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణలు డిమాండ్ చేస్తున్నాయి. కావేరీ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కర్నాటక నీటిని అంతా వాడుకుంటే తమిళనాడు గతేం కానుందన్నది అందరికి తెలిసిందే. ఎపిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలించే బృహత్తర పథకం సాగింది. దీంతో ఆ రాష్ట్రంలో కృష్ణాడెల్టాలో సమస్య రాకుండా చూసుకున్నారు. ఇదో ఉదాహరణ మాత్రమే. అలాగే కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ కూడా సస్యశ్యామలం కాగలదు.
కేంద్రం వీటిని పరిశీలించి జాతీయ జలవిధానం అనుసరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న కృష్ణా నీటిని వాడుకునే సందర్భంగా ఇటీవల కృష్ణా యాజమాన్య బోర్డు తీర్పుతో అటు తెలంగాణ, ఇటు ఎపి కొంత అసహనం వ్యక్తం చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీరు ఎటు ఎంత పోతున్నదన్న ప్రశ్న ఉత్పన్నం కాలేదు. కానీ విభజన తరవాత ఇప్పుడు లెక్కటు పక్కాగా తీయడంతో తెలంగాణ వాటా దక్కించుకునే స్థితి వచ్చింది. రెండు రాష్టాల్రుగా విడిపోయిన పిమ్మట వెలువడిన ఈ తీర్పు మరింత ఎక్కువ స్థాయిలో రెండు రాష్టాల్రనూ నష్టపరిచే రీతిలో ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడి, నదీజలాల్లో కొత్త వాటాదారు వచ్చినపుడు నదీ జలాల వాటాదారులందరికీ దామాషాగా తిరిగి తమతమ హక్కు లెంతవరకో పునర్నిర్వచించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఆ న్యాయన్ని పాటించకుండా పాత రాష్ట్రంలో ఉన్న వాటాను ఇద్దరు పంచుకోవాలని చెప్పడం సరికాదు. బోర్డు ఏర్పాటు చేసినా న్యాయం జరగడం లేదు. ఎగువ రాష్టాల్రను విడిచిపెట్టి, దిగువ రాష్టాల్రను పాత లెక్కల్లోనే తేల్చుకోమనడం అన్యాయం కాక మరోటి కాదు. దీనిని పంచుకోవాల్సి వస్తే ట్రిబ్యునల్ అవసరమే లేదు. వర్షపాతం తగ్గి, నదీజలాల లభ్యతలో కొరత ఉండడం సాధారణంగా మారిన ప్పుడు అందుకు తగ్గట్టుగా న్యాయంగా, స్పష్టంగా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్ గమనంలోకి తీసుకున్నట్టు లేదు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ లో కౌంటర్ దాఖలు చేయడం ద్వారా కేంద్రం రెండు తెలుగు రాష్టాల్రకు అన్యాయం చేసింది. ఉమ్మడి ఏపీ విభజనతో నదీ పరీవాహక రాష్టాల్రుగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపిలకు సమాన హక్కులు ఉండాలి. నీటి పంపిణీ పంచాయతీ నుంచి మహారాష్ట్ర, కర్నాటకలను ట్రిబ్యునల్ మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు, అంతర్జాతీయ నీటి చట్టాలకు పూర్తి విరుద్ధం. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవలంబిస్తున్న ధోరణి, అది చేపట్టిన విచారణ మొదటి నుంచీ ఎగువ రాష్టాల్ర కు అనుకూలంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా సాగింది. మిగులు జలాలపై దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ అవార్డు పూర్తి హక్కులు కల్పించగా బ్రిజేష్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో ఎగువ రాష్టాల్రకు వాటా ఇచ్చి తన అశాస్త్రీయ విధానంతో ఏపీకి తీరని అన్యాయం చేసింది. ఈ అన్యాయంపై ఇంకా పేచీలు కొనసాగుతున్నాయి. నీటి లభ్యత లేని సమయంలో ఎగువ రాష్టాల్రు తమకు కేటాయించిన నీటిని వాడుకుంటే కిందికి చుక్కరాదు. దిగువ రాష్ట్రం అనివార్యంగా నష్టపోవాల్సిందే. కొత్తగా తెలంగాణ ఏర్పడ్డ కారణంగా ఇప్పుడు నీటిని అన్ని రాష్టాల్రు సమానంగా పంచుకునేలా తీర్పు ఉండాలి. అప్పుడే న్యాయం జరగగలదు. తెలంగాణ, ఆంధ్ర సమస్యగా ఉద్వేగాలతో ముడిపెట్టకుండా రెండు తెలుగు రాష్టాల్రు సమన్వయంతో పని చేయాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్