తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి కిషన్ రావు తనకు పి.వి.తో వున్న అనుబంధం గుర్తు చేసుకొన్నారు. వరంగల్లు లోని మహబూబియా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిగా నాడు తాను రాసిన పుస్తకాన్ని పి.వి.రాష్ట్ర మంత్రిగా ఆవిష్కరించారని తెలిపి ఆ పుస్తకాన్ని ప్రేక్షకులకు చూపారు. పూర్వ పోలీసు ఉన్నతోద్యోగి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా ఆశ్రమ విద్య అందాలనే లక్ష్యంతో మొట్టమొదటి ఆశ్రమ పాఠశాలను నల్గొండ జిల్లా సర్వేల్ ప్రారంభించారని అనంతరం కేంద్ర మంత్రిగా నవోదయ విద్యాల యాలను దేశమంతటా ప్రారంభించి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దారని తెలిపారు. దేశ సేలందించిన అరుదైన ప్రధాని పి.వి.ఆయన సంస్కరణ బాటలు మన దేశస్థులు విదేశాలలో స్థిరపడి ఉన్నత స్థితిలో వుండడానకి కారణం అయ్యాయని భారతీయులు ఎవరు పి.వి.ని. మరువరానిది తెలిపారు. సుప్రీంకోర్టు సీనియర న్యాయవాది డా.జి.వి.రావు తన తండ్రి పూర్వ ఎన్నికల కమీషనర్ జి.వి.జి.క్రిష్ణమూర్తితో పి.వి.గారికి వున్న అనుబంధాన్ని గుర్తు చేశారు.యంయల్సీ సరభి వాణి దేవి మాట్లాడుతూ తనతండ్రి పివికి దేశం కొరకు ఏదో సేవచేయాలనే తపన వుండేదని అందుకే మహిళల అభివృద్ధికి డ్వాక్రా సంఘాలు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సాధికారత కొరకు క్రుషి చేసారని తెలిపారు.
పి.వి.కుమారుడు పి.వి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా ప్రధానిగా దేశంలో గొప్ప సంస్కరణలు ఆయా శాఖలకు తీసుకువచ్చారని తెలిపారు. భగవద్గీత పౌండేషన్ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి భగవద్గీత ప్రాముఖ్యతను వివరించారు. దీన్న పఠించడం ద్వారా మానవుని జీవనయానం లాంటి విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అధ్యాత్మిక వేత్త యలబారు లోకనాథ శర్మ,సుప్రీంకోర్టు న్యాయవాది జి.వి.రావు,పూర్వ పోలీస్ అధికారి లక్ష్మీనారాయణ విశిష్ట సన్మానితులుగా సత్కారాలు అతిథులచే పొందారు. ఇదే కార్యక్రమంలో పి.వి.శతజయంతి ఉత్సవాల సందర్భంగా పి.వి.పై రచనలు చేసిన మొవ్వ వ్రషాద్రిపతి,సంగంభట్ల నర్సయ్య, వెలిచాల కొండల్ రావు, రవూప్, బి.వి.ఎన్,స్వామి, పూసల రజనీ గంగాధర్, మాడుగుల మురళిధర్ శర్మ,జర్నలిస్డు వెలిజాల చంద్రశేఖర్, కె.వి.సంతోష్ బాబు, చీకోలు సుందర్య,చెన్నకేశవ రెడ్డి, పాలకుర్తి దినకర్,వొజ్జాల శరత్ బాబు,బెల్లి రాజయ్య ,లయన్ మనోహర్ రావు, సంపత్ కుమార్,బాల శ్రీనివాస మూర్తిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి.వి.మదన్ మోహన్ ,రాజ్ మోహన్,సరస్వతిమనోహర్ రావు,లతా ప్రసాద్,గీత తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శరత్ చంద్ర ,రమ్య, సక్రుతి మేఘమాల భక్తి సంగీతాన్ని ఆలపించారు. గాంధీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.