విద్యాభివృద్ధికి ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి పలు కార్పొరేట్ సంస్థలు మందుకొచ్చాయి. ఈ మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రహేజా, రామ్ కీ, యశోదా సంస్థలు నిధులు అందజేయనున్నాయి. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్‌లు శనివారం ఒప్పందం చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఆ ఒప్పంద పత్రాలను రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి.రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావులు అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కొత్త ప్రాంగణానికి మొత్తం ఖర్చులో 40% అంటే రూ.19.66 కోట్లు రాంకీ సంస్థ  ఖర్చు చేయనున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణం కోసం మొత్తం ఖర్చులో 40% అంటే రూ.10.4 కోట్లు  రాంకీ సంస్థ భరించనున్నది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కోసం అవసరమైన రూ.50.50 కోట్లను రహేజా గ్రూప్ భరించనున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ ఎంపీపీఎస్‌లో ప్రీ ప్రైమరీ, 6, 7వ తరగతుల కోసం అవసరమైన రూ.12.20 కోట్లను భరించనున్న యశోదా హాస్పిటల్స్ అందజేయనున్న. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీవో) చైర్మన్ సి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *