అనంతసాగర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం
ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు
ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… 
ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాజీవ్‌ ‌రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్లితే…రాజీవ్‌ ‌రహదారిపై నిద్ర మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ క్టొడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌గ్రామ శివారులో రాజీవ్‌ ‌రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణానికి చెందిన ఒక కళాశాల విద్యార్థులు పరీక్ష రాయడానికి కరీంనగర్‌కు కారులో వెళ్లి తిరిగి వొస్తుండగా అతి వేగం, అజాగ్రత్తతో నిద్ర మత్తుకులోకునైన కారు డ్రైవర్‌ ‌లారీని ఢీ కొట్టాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రక్తంలో పడి ఉన్న క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి…ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం
సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వివరాలు తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు… ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన బాధాకరమని, ముగ్గురు విద్యార్థుల మృతి తీవ్రంగా కలిచి వేసిందన్నారు.

వారి మృతి పట్ల సంతాపాన్ని తెలుయజేస్తూ..కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటనన్నారు.  మిగతా 8 మందిలో నలుగురు తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్‌కు తరలించాలని మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు మంత్రి ఆదేశించారు. అదేవిధంగా మిగతా విద్యార్థులకు సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. సంఘటన జరిగిన మరుక్షణం నుండి ఎప్పటికప్పుడు మంత్రి పర్యవేక్షణ చేస్తూ..విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి అధైర్యపడొద్దు..అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page