- కాంగ్రెస్ అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది
- కర్నాటకలో అధికారంలోకి రాగానే రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు
- రైతు బంధు ఆపి రైతుల నోటికాడి బుక్క లాక్కున్నారు
- అధికారంలోకి రాగానే డిసెంబర్ 6 నుంచి పంపిణీ
- మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని, అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్‌ది అదే పరిస్థితి అని, అర్ధరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టిందని మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నాడు ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టింది..2009లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు కట్టలేదని, నీళ్ళు ఇవ్వలేదని, అసెంబ్లీ వద్ద తాము ధర్నా చేస్తే పట్టించుకోలేదని, నాడు అధికారంలో ఉండీ రైతులను గోస పెట్టిన కాంగ్రెస్ నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నదన్నారు. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ అని, మూడు గంటల కరెంట్ చాలు అన్నడని, అక్టోబర్ 23న మానిక్ రావు థాక్రే రైతు బంధు వేయోద్దని ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారన్నారు.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీలో మీటింగ్ పెట్టీ చెప్పారని, భట్టి రైతు బంధు దుబారా ఆంటే, రేవంత్ రైతులు బిచ్చగాల్లు అంటాడని మండిపడ్డారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడే ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక అక్కడ రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారని, ఇక్కడ వాళ్ళే రైతు బంధు పై పిర్యాదు చేశారని, అనుమతి ఇస్తే ఎలా ఇస్తారు అన్నారని, మళ్లీ రద్దు చేయాలని వారే పిర్యాదు చేశారని, ఇప్పుడు బిజెపి బిఆర్‌ఎస్ ఫెవికాల్ బంధం అని తప్పు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది కాంగ్రెస్ పార్టీ అని, దొంగే దొంగ అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి అని అన్నారు. వంద పిల్లులు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్టు కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. దేశంలో రైతు బంధు సృష్టికర్తనే కేసీఆర్ అని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ చేతిని అడ్డం పెట్టి రైతు బంధు ఆపలేరని అన్నారు. ఎ
న్నికలో గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాస్తున్నారని, రాహుల్ గాంధీ వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నడని, మరి ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ దమ్ముంటే ఉద్యోగాల విషయమై చికడపల్లిలో కాదు బెంగళూరులో పెట్టాలని సవాల్ విసిరారు. వాళ్ల బాండ్ పేపర్లు చిత్తు కాగితాలతో సమానమని, ఉద్యమాల గడ్డలో కాంగ్రెస్ పార్టీ వాళ్ల మాయ మాటలు ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, 80 సీట్లతో మంచి గెలుపు సాధిస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. బిజెపి కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆరోపింఆచరు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఎందుకు అమలు చేయరని, బిజెపి, కాంగ్రెస్ దొందు దొందేనని, మీటర్లు పెట్టాలని బిజెపి అంటే, మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ అంటదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటూ హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు రైతు బంధు అపొచ్చు కానీ, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వొస్తాయని, 6 నుండి మనం రైతు బంధు అమలు చేసుకుందామని హరీష్ రావు భరోసా ఇచ్చారు.