అద్వానీకి అంది వొచ్చిన భారతరత్న

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన రాజకీయ తాత్వికుడు రెండు దశాబ్దాల మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి 21వ శతాబ్దపు ప్రారంభ కాలం వరకు భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రజా హృదయుడు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో 1927 సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో ఎందరో స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్న తరుణంలో నాటి భరత్‌ ఖండమైన ప్రస్తుత పాకిస్తాన్‌ కరాచీలో 1927 వ సంవత్సరం నవంబర్‌ 8న కిసాన్‌ చంద్‌ అద్వానీ మరియు జిజియా దేవి దంపతులకు  సింధు ప్రాంతంలో ఉదయించిన భారత్‌ భవిష్యత్తు రాజకీయ ప్రజ్ఞుడు లాల్‌కృష్ణ అద్వానీ. కరాచీలోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యనూ ప్రారంభించి పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్యనూ అభ్యసించారు. 1947లో ఆరెస్సెస్‌ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు చేపట్టి దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్‌ 12న భారత్‌ కు అద్వానీ వలస వచ్చారు. 1957లో ఆరెస్సెస్‌ పిలుపుతో దిల్లీకి వలస వచ్చిన అద్వానీ  1960లో ఆర్గనైజర్‌ పత్రికలో జర్నలిస్టుగా అద్వానీ విధులు నిర్వహించారు.

1966లో దిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికలో విజయం సాధించి  1967లో దిల్లీ మెట్రోపాలిటిన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అద్వానీ 1970-72లో భారతీయ జనసంఫ్‌ు దిల్లీ విభాగం అధ్యక్షుడిగా  పాత్ర పోషించారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన అద్వానీ  1973-76లో జన్‌సంఫ్‌ు అధ్యక్షుడిగాను  1974-76లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగానూ పోషించి 1975వ సంవత్సరంలో భారత గణతంత్ర దేశం చీకటి మయమైన గాఢ  అంధ కారంలో కూరుకుపోయింది ఎమర్జెన్సీ పేరుతోటి మీసా చట్టం కింద అరెస్టు అయినటువంటి అద్వానీ తన  జైలు జీవితాన్నిది ఫ్రీజనేర్స్‌ స్కాఫ్‌ అనే గ్రంథాన్ని రచించారు. ఆ తర్వాత 1977-80లో  జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనతా పార్టీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటి కాంగ్రెస్‌ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సమాచార శాఖ మంత్రి గాను రెండు విభాగాలలో కీలక పాత్ర పోషించి 1980 ఏప్రిల్‌ 6న అటల్‌ బిహారీ వాజ్పేయి తో కలిసి భారతీయ జనతా పార్టీ స్థాపించారు. 1982 ఎన్నికలలో రెండే లోక్‌ సభ స్థానాలను గెలుచుకున్న బిజెపి 1986లో జాతీయ బిజెపి పార్టీ అధ్యక్షుడిగా ఎల్‌ కే అద్వానీ ఎన్నికైన 1989లో జరిగిన లోక్‌ సభ ఎన్నికలలో 86 లోక్‌ సభ స్థానాలను బిజెపి పార్టీ గెలుచుకోవటం ఎంతో గర్వకారణం ఇదంతా కూడా వాజపేయి మరియు ఎల్కే అద్వానీలకే దగ్గుతుంది అనటంలో ఆశ్చర్యం లేదు. 1990వ సంవత్సరంలో అయోధ్య రథయాత్రను ప్రారంభించి 10,000 కిమి  రథయాత్ర చేసి అప్పటి బీహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బీహార్‌ లో  అడ్డుకోవడం తోటి పాదయాత్రను నిలిపివేసి.. 1991 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 120 లోక్‌ సభ స్థానాలను తీసుకొచ్చి ఆ తర్వాత 1992 డిసెంబర్‌ 6న అయోధ్య కరసేవ సంఘ అధ్యక్షుడుగా పనిచేస్తూ అరెస్టు రావడం జరిగింది. అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 80వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు నిరసనగా 1993 సంవత్సరంలో జన దేశ యాత్రను ప్రారంభించారు.ఆ ప్రాంతీయ పార్టీలతో కలిసి నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ తో కేంద్రంలో వాజ్‌ పాయ్‌  ప్రధానమంత్రి గా అద్వానీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 1996లో 13 రోజులకే కుప్పకూలిన బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం 1997 స్వర్ణజయంతి రథయాత్రను ప్రారంభించారు.

1997 మే 5 నుంచి 1997 జులై 15 వరకు 59 రోజులు ఈ రథయాత్ర విజయవంతంగా కొనసాగింది ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి  1999 ఎన్నికల్లో గెలిచి వాజ్‌?పేయూ సర్కార్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా  విధులు నిర్వహించారు. కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా  కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వగా అద్వానీకి అదనపు బాధ్యతలు పట్టారు.  2004లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అద్వానీ భారత్‌ ఉదయాత్రను ప్రారంభించి దేశ ప్రజలలో కొత్త రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చారు. తర్వాత నాటి యూపీఏ ప్రభుత్వం తీవ్రవాదులను నిరోధించడంలో విఫలమైందని చెప్పి 2006వ సంవత్సరంలో తీవ్రవాద వ్యతిరేక యాత్రను ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా అద్వానీ పోటీ చేసినప్పటికీ  ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 2009లో యూపీఏ తన మిత్రపక్షలతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయినప్పటికీ అద్వానీ తన రాజకీయ యాత్రను తిరిగి ప్రారంభించి 2011 అక్టోబర్‌ లో చైతన్య యాత్రను ప్రారంభించారు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఈ చైతన్య యాత్ర  ముఖ్య ఉద్దేశం.2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ గెలుపుకు ఎల్‌ కే అద్వానీ కీలక పాత్ర వహించారు. 2014 ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి గెలిచిన అద్వానీ  2019లో క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమైనపటికి. అద్వానీ రథయాత్ర మాత్రం అప్పటికీ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగింది అనడంలో  2019 నుంచి 2024 మధ్యలో జరిగిన రామ మందిర నిర్మాణమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.

ఏమైనాప్పటికీ 120 సంవత్సరాల చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ పరిపాలన వ్యవస్థ నుంచి దేశాన్ని విముక్తి చేసి. భారతదేశ హిందుత్వ సిద్ధాంతాన్ని రాముడు పరిపాలించిన ఈ భారత దేశంలో తిరిగి రామరాజ్యాన్ని స్థాపించే ఉద్దేశంతో దేశ ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని పురికొల్పి భారతీయ జనతా పార్టీ ద్వారా కొత్త ప్రభుత్వాన్ని నిర్మాణానికి పురుడు పసినటువంటి అద్వానీ కి భారతరత్న అందించటం దేశానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. నేడు భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా అద్వానీకి భారతరత్న రావడం దేశంలోని అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీల నాయకులు వర్షం వ్యక్తం చేశారు. అద్వానీని ఆధునిక చాణ్యుకునిగా  కొనియాడుతూ ఇలాంటి రాజకీయ పరిపక్వత చెందిన నాయకులు భవిష్యత్తు భారతానికి అవసరమని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం హర్షణీయం . రాబోయే భారత భవిష్యత్తు రాజకీయాలలో అద్వానీ లాంటి నాయకులు ఉద్భవిస్తారని ఆశిద్దాం.
-పూసపాటి వేదాద్రి,
కవి సాహితీ విశ్లేషకులు
9912197694

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page