పాలనలో మీ నిబద్ధత ఆదర్శప్రాయం

– మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, పలువురు మంత్రులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆమెకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అడవి బిడ్డగా జీవిత పోరాటాన్ని ప్రారంభించి ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సీతక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ‘ఎక్స’లో పోస్టు చేశారు. మహిళల సాధికారత, గ్రామీణ అభివృద్ధి కోసం మీరు చూపుతున్న అంకితభావం, నిబద్ధత, నిరంతర కృషి ఆదర్శప్రాయమైనవని కొనియాడారు. మీరు సంపూర్ణ  ఆయురారోగ్యాలతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో విజయపథంలో ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. ప్రజాసేవే జీవిత ధ్యేయంగా ఎంచుకుని అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంకితభావంతో, అపారమైన మానవత్వంతో మీరు చేస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అపార శక్తిని ప్రసాదించి, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ఇలాగే ముందుండేలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ‘ఎక్స’లో పోస్టు చేశారు. అడవి బిడ్డగా జీవిత పోరాటాన్ని ప్రారంభించి, ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సహచర మంత్రి సీతక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఎక్స’లో పోస్టు చేశారు. ప్రజాపాలనలో మహిళల సాధికారత, గ్రామీణ అభివృద్ధి కోసం మీరు చూపుతున్న అంకితభావం, నిబద్ధత, నిరంతర కృషి ఆదర్శప్రాయమైనవి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో విజయపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో సీతక్క మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

గట్టమ్మ ఆలయంలో పూజలు

ములుగు : తన జన్మదినం సందర్భంగా గట్టమ్మ ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బాలసదన్‌లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ గీత రచయిత పాలకుర్తి రాజేందర్ రచించిన, ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ ఆలపించిన అడవి తల్లి బిడ్డ సీతక్క పాటను ఆమె ఆవిష్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *