లిఫ్ట్ ఉందనుకుని అడుగు వేసి..

– నాలుగో అంతస్తు నుంచిపడి యువకుడి మృతి
– లిఫ్ట్ లేకుండానే డోర్ తెరుచుకోవడంతో ఘటన
– మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్ లో ప్రమాదం
– లిఫ్ట్ భద్రత, నిర్వహణ లోపాలపై పోలీసుల దర్యాప్తు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : లిఫ్ట్ ఉంద‌ని భావించి ఆ యువకుడు డోర్ తెరిచి ముందుకు అడుగు వేశాడు. కానీ అక్కడ లిఫ్ట్ లేదు.. క్షణాల్లోనే నాలుగో అంతస్తు నుంచి గుంతలో పడిపోయి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్-5, బ్లాక్ బీ-3లో వెంకటేష్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు విజయ్ బాబు (24)కి వినికిడి, చూపు సమస్యలతోపాటు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం విజయ్ బాబు నాలుగో అంతస్తులోని లిఫ్ట్ వద్దకు వెళ్లి డోర్ తెరిచాడు. ఆ సమయంలో లిఫ్ట్ మొదటి అంతస్తులో ఉన్న విషయం తెలియక అడుగు ముందుకు వేశాడు. దీంతో ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి అతడు మొదటి అంతస్తులో నిలిచి ఉన్న లిఫ్ట్ పైభాగంపై పడిపోయాడు. విజయ్ బాబు తలతోపాటు శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, అపార్ట్ మెంట్ వాసులు వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విజయ్ బాబు మృతిచెందినట్లు నిర్ధారించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీ లించారు. నాలుగో అంతస్తులో లిఫ్ట్ లేకున్నా డోర్ ఎలా తెరుచుకుందనే అంశంతోపాటు లిఫ్ట్ భద్రతా వ్యవస్థ, నిర్వహణపై ఆరా తీస్తు న్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు పోలీసులు తెలిపారు. యువకుడి ఆకస్మిక మరణంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అపార్ట్మెంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *