హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 19 : హైకోర్టు సమీపంలోని మదీనా క్రాస్ రోడ్డులో ఉన్న బాంబే వస్త్ర దుకాణం/గెÃదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పొగ ధాటికి స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుని ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించారు. హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ కావడంతో నష్టం భారీగా ఉండొచ్చని అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





