అసెంబ్లీలో ఏలేటి వ్యాఖ్యలపై దుమారం

– ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారపక్షం
– సజావుగా సాగడం ఇష్టం లేదని వ్యాఖ్యలు
– శాసనసభ నుంచి వాకౌట్‌ ‌చేసిన బీజేపీ
– స్పష్టమైన అజెండా తర్వాతే సభకు
– బీజేపీ ఎల్పీ నేత ఏలేటి 

హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం రేగింది. సభలో లేని సభ్యులను సస్పెండ్‌ ‌చేయడం బాధాకరమని అన్నారు. సభ ఉల్లంఘన జరిగినప్పుడు బీజేపీ శాసనసభపక్ష నేతగా కొన్ని అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఏ నియమ నిబందనల ప్రకారం సస్పెండ్‌ ‌చేశారంటూ కొత్తగా ఏమైనా పుస్తకం తయారు చేసుకున్నారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏడు గంటల కరెంట్‌ ‌కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఏసీలో చెప్పినట్లు సభ నడుపుతారా లేదా.. రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 22ఏ పై ఎప్పుడూ చర్చిస్తారో చెప్పే వరకు సభలో తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. సభ ఔన్నత్యాన్ని కాపాడటం మనందరి బాధ్యతన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ స్థానంలో ఉన్న వారి గౌరవాన్ని కాపాడేలా మాట్లాడాలని హితవు పలికారు. ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి శ్రీధర్‌బాబు సభ కార్యక్రమాలను నిరంతరం అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. సభ సజావుగా సాగడం బీజేపీ సభ్యులకు ఇష్టం లేనట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా సభ నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దళిత వర్గాలు, బలహీనవర్గాల హక్కులను కాపాడాలని సూచించారు. సామాజిక న్యాయం చేయాలని లేకపోతే ఏమనాలని ప్రశ్శించారు. విద్యాశాఖలో తెచ్చిన సంస్కరణలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, 22ఏ సమస్యపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ సభ్యుల వైఖరి మార్చుకుంటేనే మరింత ఎదుగుతారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హితవు పలికారు. దళితులను అవమానించినవారిని సమర్థించడం మంచి పద్ధతి కాదని సూచించారు. రాష్ట్ర‌ ప్రయోజనాల కోసం కొట్లాడితే వారిని మెచ్చుకోవచ్చన్నారు.స భ సజావుగా జరగడం బీజేపీ సభ్యులకు ఇష్టంలేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ్యసమాజం తలదించుకునేలా స్పీకర్‌పై ఇష్టానుసారం మాట్లాడతారా అని నిలదీశారు. నిరసన కార్యక్రమం చేస్తుంటే శుద్ధి చేయడం మంచి పద్ధతా అని ప్రశ్నించారు. ఎర్రవల్లిలో దళితులు కార్యక్రమం చేసిన చోట శుద్ధి చేయడాన్ని ఏమనాలంటూ ఖర్గే కూర్చున్న వేదికను ఎందుకు శుద్ధి చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులను డిమాండ్‌ ‌చేశారు. శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్‌ ‌చేసింది. ప్రభుత్వం అజెండా అంశాలను ముందే ఇవ్వట్లేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్పష్టమైన అజెండా ఇచ్చిన తర్వాతే సభ వస్తామని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *