రేపు నింగిలోకి జీఎస్సెల్వీ-ఎఫ్18

– మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో స్వదేశీ సాంకేతికను మరింత బలోపేతం చేసేదిశగా ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. దేశీయ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ నావిక్ కు అదనపు సామర్థ్యాన్ని అందించే ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ నెల 30న అంటే శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ గురువారం రాత్రి ప్రారంభమైంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *