-పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరుగులు
-మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటనతో రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గాప్రసాద్ అనే యువకుడు కొద్ది రోజులుగా ఓ యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలపై రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల చర్యలపై భయాందోళనకు గురైన యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పెట్రోల్‌తో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దుర్గాప్రసాద్ అక్కడే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలతో అతడిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హాస్పిటల్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యువకుడు పోలీస్ స్టేషన్‌లోకి పెట్రోల్‌తో ఎలా వచ్చాడు.. ఘటనకు ముందు ఏం జరిగింది.. కేసు నమోదు తర్వాత అతడికి పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఎదురయ్యాయి అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు