– అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం
– నవంబర్ 9న తుది వోటర్ల జాబితా విడుదల
న్యూదిల్లీ, సెప్టెంబర్ 7 : తెలంగాణలో వోటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. గతంలో పొడిగించిన షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉంది. అయితే, వోటర్ల జాబితా సవరణ ప్రక్రియకు మరింత సమయం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా లేఖలు రాశారు. వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించిన అనంతరం నవంబర్ 9వ తేదీన తుదివోటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈసీ నిర్ణయంతో కొత్తగా వోటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారికి, అలాగే జాబితాలో తప్పులను సరిదిద్దుకోవాలనుకునే వారికి అదనపు సమయం లభించినట్లయింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




