హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ వేదికగా బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నల్ల దుస్తుల నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో ఇలాంటి దిగజారుడు ప్రవర్తనను చూడలేదని మండిపడ్డారు. ఎవరో చనిపోయినట్లు నల్ల బట్టలు ధరించి అసెంబ్లీకి వచ్చి డ్రామాలు ఆడటం కాకుండా దమ్ముంటే సభ లోపలికి వచ్చి వాస్తవాలపై చర్చించాలని హితవు పలికారు. ప్రజల సొమ్ముతో సమస్త సౌకర్యాలు, భద్రత పొందుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటుంటే, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా విపక్ష సభ్యులు రచ్చ చేస్తున్నారని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




