మీ పాలనలో ఎంత ధాన్యం కొన్నారో..

– ఆత్మ పరిశీలన చేసుకోవాలి
– బీఆర్‌ఎస్‌కు మంత్రి ఉత్తమ్ సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : బీఆర్‌ఎస్ తన పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో ఒకసారి విమర్శ చేసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యాన్ని కొన్నామని, అందుకు నిదులు ఇచ్చామని చెప్పారు. మీడియాతో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తన భాద్యత నిర్వర్తించడం లేదు కానీ తమపై విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు. తాము 70 క్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం.. ఆ ధాన్యం మొత్తం కేంద్రం కొనాలి అని డిమాండ్ చేశారు. 8,575 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రంలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లో నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. కేంద్రం  చెప్పిన మద్దతు ధర పెట్టి ధాన్యం తీసుకోవాలన్నారు. బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ధాన్యం తెలంగాణ కొనుగోలు చేస్తున్నదని, కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటే ఇక్కడ ఆ పార్టీ నాయకులు యాత్రలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రాల కంటే డబుల్ ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. కేంద్రం ఎంఎస్‌పీ ప్రకటించి రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. నిన్నటి వరకు 54లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత ధాన్యం కొన్నదో బీజేపీ నాయకులు చెప్పాలని నిలదీశారు. గత ఏడాది, ఇప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో కంటే రూ.5వేల కోట్లు ఎక్కువ ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. రూ.3500 కోట్లు ఎంఎస్‌పీ నిదులు మే వరకు ఇస్తే తాము రూ.11,500 వేల కోట్లు ఇచ్చామన్నారు. 3800 ఎంఎస్‌పీ ఇస్తే ఇప్పుడు మే వరకు రూ.9వేల కోట్లు  ఇచ్చామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *