– పట్టుబడిన మహిళా తహసిల్దార్, సర్వేయర్
మేడ్చల్, ప్రజాతంత్ర, మే 26: : ఏసీబీ వలలో రెండు అవినీతి చేపలు చిక్కాయి. నాలా కన్వర్షన్ కోసం, భూములు సర్వే చేయడానికి లంచం తీసుకుంటూ మహిళా తహసీల్దార్, మండల సర్వేయర్ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ఆమె డ్రైవర్ నాగేష్‌ను కూడా అరెస్టు చేశారు. 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తును ఆమోదించాలని తహసీల్దార్‌ను ఓ వ్యక్తి కోరగా అందుకు రూ.30లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం మధ్యాహ్నం కార్యాలయంలో తహసీల్దార్ ప్రైవేటు డ్రైవర్ నాగేష్‌కు రూ.2లక్షలు అందజేశాడు. ఆ డబ్బును తహసీల్దార్ సుచరితకు ఇస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం ఇద్దరు, మంగళవారం మరో ఇద్దరు ఏసీబీ వలకు చిక్కడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
వడ్డేపల్లి మండల సర్వేయర్..
జోగులాంబ గద్వాల: భూములు సర్వే చేయడానికి లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ బ్రహ్మయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. తన భూమిని సర్వే చేయాల్సిందిగా సర్వేయర్ బ్రహ్మయ్యను బాధితుడు ఆశ్రయించగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహం మేరకు పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





