– 200 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు
– హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజి సంస్థ ‘యామైన్’ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరి శోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయ డానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో మంగళవారం ఎంఓయు చేసుకుంది. అంతకు ముందు శ్రీధర్ బాబుతో బేటీ అయిన యామైన్ ఇండియా ప్రతినిధులు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. సమావేశానంతరం యామైన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, తెలంగాణా ప్రభుత్వ పరిశ్ర మల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్యలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. జెనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశోధన కేంద్రంలో 200 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకా శాలు లభిస్తాయని శ్రీధర్ బాబు ఈ సందర్భం గా వెల్లడించారు. యామెన్ ఇటీవల 3 వేల మంది ఉద్యోగులతో అతి పెద్ద జిసిసి ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఔషధ రంగ దిగ్గజ కంపెనీలు తెలంగాణ పట్ల అపార విశ్వాసం కనబర్చడం తమ ప్రభుత్వా నికి దక్కిన గౌరవమని అన్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాష్ట్రం ఒక ముఖ్యమైన వేదికగా మారడం పట్ల శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేసారు. దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామైన్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్ఫ్లమేషన్, శ్వాసకోశ వ్యాధులు, అరుదైన వ్యాధులు తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తోంది. కార్యక్రమంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, యామైన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, ఇడి శ్రీను కొసరాజు, అనుమిత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





