– సీఎం సోదరులంతా పెద్దపెద్ద కంపెనీ ఓనర్లు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా సీఎం సోదరులు చిన్నచిన్న ఇంటి అడ్రస్లతో పెద్దపెద్ద కంపెనీలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అలాంటి ఊరుపేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన అయిదెకరాల భూమి కేటాయించింది. అనుముల కొండల్రెడ్డి టెసరాక్ కంపెనీ చైర్మన్ అని లింక్ డ్ ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. మరో సోదరుడు జగదీశ్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. సీఎం బామ్మర్ది సృజన్రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్టు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు. రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లతో కంపెనీలు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టెస్రాక్ట్ కంపెనీలో ఒక్క ఎంప్లాయీ కూడా లేరని.. లక్ష రూపాయలతో ఆ కంపెనీ పెట్టడం ఎలా సాధ్యమని నిలదీశారు. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు ఎలా కేటా యించారని ప్రశ్నించారు. రూ.2వేల కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.7 వేల కోట్లకు కేటాయించారని ప్రస్తావించారు. ఆ కంపెనీకి కొండల్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు ఎలా చెబుతారని నిలదీశారు. శ్రీధర్ బాబుకి తన శాఖలో ఏం జరుగుతుందో తెలియదా.? లేక సీఎం వత్తిడికి తలొగ్గరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం సీఎం భార్యకు మూడె ఎకరాలు కేటాయించడంపై కేసు నమోదైందని తెలిపారు. ముడా స్కాంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అనుముల కొండలరెడ్డి టెస్రాక్ట్ సంస్థ కి చైర్మన్గా ఆయనే పేర్కొన్నారు. కొండల్ రెడ్డికి సంబంధం లేకుంటే యూఎస్ కౌన్సిల్ టింగ్ కి ఎలా వెళ్లారని నిలదీశారు. ఈ భూ కేటాయింపులను వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. తిరుపతిరెడ్డి ఏ హోదాలో అధికారిక సమావేశాలకు వెళ్తారని ప్రశ్నించారు. ప్రజలకు పట్టాలు ఏ హోదాలో ఇస్తారని నిలదీశారు. రాష్ట్ర గవర్నర్నీ కలిసి ఈ విషయంపై విచారణ జరపాలని కోరతామని అన్నారు. 74 లక్షల వోట్లు తొలగిస్తారనేది ఆందోళనకరమైన విషయమని చెప్పుకొచ్చారు. ముసాయిదా వోటర్ల జాబితా విడుదల తర్వాత పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అర్హుల వోట్లు కోల్పోకుండా చూస్తామని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే జీఆర్ఎంబీ టింగ్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా స్పష్టం చేయాలన్నారు. జల సౌదాలో జరిగే జీఆర్ఎంబీ అజెండా మార్చుకుంటే జలసౌధను ముట్టడిస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వరుణ యాగం చేయడం తప్పు కాదు కానీ ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





