ముగ్గురు పిల్లలతో లోయలోకి దూకి రెజ్లర్ ఆత్మహత్య

ముంబై, సెప్టెంబర్ 4 : మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ‘మహారాష్ట్ర టైగ్రెస’గా పేరొందిన జాతీయ మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి నల్‌దుర్గ్ కోటపై నుంచి వంద అడుగుల లోతైన లోయలోకి దూకింది. ఈ దారుణ ఘటనలో అశ్విని, ఆమె ఐదేళ్ల కుమారుడు అజింక్యా అక్కడికక్కడే మృతిచెందగా, కవల కుమార్తెలలో క్రాంతి హాస్పిటలో కన్నుమూసింది. మరో చిన్నారి వీరా తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. జాతీయ స్థాయిలో 5 స్వర్ణాలు, 6 రజత పతకాలు సాధించిన అశ్విని మృతిపై తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. భర్త, అత్తమామల శారీరక, మానసిక వేధింపుల వల్లే తన కుమార్తె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని అశ్విని తండ్రి ఫిర్యాదు చేయడంతో నల్‌దుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *