రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత

– ఒడిశా దంపతుల అరెస్ట్

అశ్వాపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి దం దాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి భద్రాచ లం, మణుగూరు, ఏటూరునాగారం మీదు గా షిర్డీకి కారులో గంజాయిని తరలిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా రంతో ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి గొల్లగూడెం శివారులోని సీతారాం కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నెక్సాన్ కారును ఆపి తనిఖీ చేయగా, కారు వెనుక డిక్కీలో 40 కిలోల 560 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుం దని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు కలిమెలకు చెంది న భార్యాభర్తలు అరబిందో బిశ్వాస్, సుప్రి POLICE య బిశ్వాస్ గా గుర్తించారు.విచారణలో వారు కలిమెలలోని సాలబాగ్ గ్రామానికి చెందిన హరిశ్చంద్ర మిస్త్రీ, సుశాంత్ మండల్ అనే ఇద్దరి వద్ద నుంచి గంజాయిని తీసుకుని, షిర్డీలోని రోహిత్ యాబిన్ అనే వ్యక్తికి సరఫరా చేసేందుకు వెళ్తున్నట్లు అంగీకరించారు. ఎస్ఐ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఎల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీం దర్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్ప డే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *