భద్రాద్రి ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాలి

– మంత్రి పొంగులేటి

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : వొచ్చే డిసెంబర్ లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లోపు ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వొచ్చే ఏడాది శ్రీరా మనవమి ఉత్సవాల్లోపు అన్ని పనులు పూర్త య్యాలా చర్యలు చేపట్టాలని మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం దర్శించు కున్నారు. కలెక్టర్ అంకిత్, భద్రాచలం, ఎ మ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంక టేశ్వర్లు, జారే ఆదినారాయణతో కలసి పూజలు చేశారు.
అనంతరం దేవాలయం లో చిత్రకూట మండపం పరిసరాలు, గోశాల ప్రాంతాలు,
అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, శివాల యానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాలయంలో జరుగుతు న్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది 2027 జూన్- జులై నెలలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారం భంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రు. 276 కోట్ల నిధులు ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *