కేసీఆర్ చాలా మంచోడు

– హుందాగా రిసీవ్ చేసుకునేవారు
– కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుస ఇంటర్వ్యూలతో కాంగ్రెస్ సర్కార్‌పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో బీఆరఎస్‌లో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహారశైలి ఎలా ఉండేదన్న ప్రశ్నకు సురేఖ స్పందిస్తూ ‘కేసీఆర్ చాలా మంచి వ్యక్తి.. ఎప్పుడు కలిసినా తమను ఎంతో గౌరవంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారు’ అని కొనియాడారు. బీఆరఎస్‌లో పనిచేసినన్ని రోజులు కేసీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం అడిగిన వెంటనే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. నాడు కొండా మురళికి ఎమ్మెల్సీ పీఠం దక్కకుండా పార్టీలోని కడియం శ్రీహరి వంటి కొందరు సీనియర్ నేతలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, కానీ కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని మిగిలిన వారి నామినేషన్లను ఉపసంహరింపజేసి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూశారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీవ్ర అసంతృప్తితో, బర్తరఫ్ వేటుతో బయటకు వచ్చిన సురేఖ కేసీఆర్ పాలనను, ఆయన వ్యక్తిత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కేసీఆర్‌పై సురేఖ సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో కొండా దంపతులు బీఆరఎస్‌లో చేరే అవకాశం ఉందా అనే ప్రచారం జోరందుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *