కేంద్ర ప్రభుత్వం చొరవతోనే కొత్త రైల్వే లైన్

– కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదం
– బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జిల్లా కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభి వృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయం లో గురువారం విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. పాండురంగాపురం నుం చి మల్కనగిరి వరకు రైల్వే లైను కేంద్ర కేబి నెట్ ఆమోదం తెలపడం గొప్పవిషయమని అన్నారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు తానే కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్రం నిర్ణయాలను వ్యక్తిగత ఘనతగా చెప్పుకొని ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర బృందం సర్వేకు రావడం శుభపరిణామమని, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సరైన స్థలాన్ని అందిస్తే విమానాశ్రయ మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. గత రెండు
నెలల్లో సింగరేణి విషయంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుందని, తాటిచెర్ల బ్లాక్ను సింగరేణికి కేటాయించిందని తెలిపారు. మణుగూరు డీప్సైడ్ బ్లాక్ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి ఇబ్బందులు కలిగించిందని, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో పీకే ఓసీ -2 డీజ్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కిందని అన్నారు. భవిష్య త్తులో కొయ్యగూడెం ఓసీ-3 బ్లాక్ను కూడా సింగరేణికే కేటాయించేందుకు చర్యలు తీసు కుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు.. భద్రాచలంలో రెండో వంతెనతో పాటు అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూ రు చేస్తోందని తెలిపారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదన్నారు. జిల్లా ఆఫీస్ సెక్రటరీ దురిశెట్టి కుమార్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్య క్షుడు నవీన్, బూర్గంపాడు మండల అధ్య క్షుడు బీరక సాయి, మహిళా మోర్చా జిల్లా అధ్య క్షురాలు సముద్రాల గాయత్రి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు జుజ్జూరు మోహన కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల హరీష్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు మహంకాళి శంకర్, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి బుర్ర సతీష్, కార్మిక సెల్ కన్వీనర్ గుమలా పురం సత్యనారాయణ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *