కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ మరో ఉద్యమం

– 6న ఇందిరా పార్క్ వద్ద ‘మహా ధర్నా’

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : శాసనసభసమావేశాలు ఈనెల 7 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టేలా అధికార కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు సెప్టెంబర్ 6వ తేదీ (ఆదివారం) హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ‘మహా ధర్నా’కు హస్తం పార్టీ నిర్ణయించింది. ఆదివారం నాటి కాంగ్రెస్ మహా ధర్నాను అత్యంత ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం 9 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించబోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుల ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చా ర్థులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకాబోతున్నారు. ధర్నాను విజయవంతం చేసేందుకు కార్యాచరణ, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *