“భారతదేశం 2020లో $83.2 బిలియన్ల నుండి 2024లో $137.7 బిలియన్ల రెమిటెన్సులను అందుకుంది.ప్రపంచ బ్యాంకు 2025 నాటికి ఈ సంఖ్యను సుమారు $150.7 బిలియన్లుగా అంచనా వేసింది. మరే ఇతర దేశం కూడా దీనికి దరిదాపుల్లో లేదు. కానీ, విదేశాల నుండి పంపే డబ్బు దేశానికి కలిగే లాభానికి ఒక బలహీనమైన కొలమానం మాత్రమే. గల్ఫ్ దేశాల నమూనా భారతదేశానికి బాగా పనిచేసింది, ఎందుకంటే అక్కడి కార్మికులు తమ స్వదేశాలకు తిరిగి వొస్తారు. వారు కొన్ని సంవత్సరాలు వెళ్లి, డబ్బు పంపి, చివరికి పొదుపు , అనుభవంతో తిరిగి వొస్తారు. యూరప్, అమెరికా , ఆస్ట్రేలియాలలో పద్ధతి భిన్నంగా ఉంటుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు ఒప్పందాలపై వొచ్చి, స్థిరపడి, తమ కుటుంబాలను తీసుకువొచ్చి, డబ్బు పంపడం ఆపేస్తారు. భారతదేశానికి కలిగే నష్టం శాశ్వతమైనది…”
ప్రపంచం వృద్ధాప్యం వైపు ప్రయాణిస్తున్నది , కానీ భారతదేశం అలా కాదు. ఐరోపా, జపాన్, తూర్పు ఆసియాలోని ఇతర ప్రాంతాలలో, వృద్ధులను చూసుకోవడానికి లేదా కర్మాగారాలలో పనిచేయడానికి తగినంత మంది యువకులు లేరు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో యువ శ్రామిక శక్తి ఉంది, రాబోయే రెండు దశాబ్దాల పాటు, ఇతర దేశాలకు కొరతగా ఉన్న వ్యక్తులను ప్రధానంగా సరఫరా చేసే దేశం ఇదే కావొచ్చు . ఈ డిమాండ్ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నది . 2040 నాటికి 5,70,000 మంది సంరక్షణ కార్మికుల కొరత ఉంటుందని జపాన్ అంచనా వేస్తున్నది . వొచ్చే ఐదేళ్లలో 50,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయులను నియమించుకోవడానికి ప్రణాళికలను ప్రకటించింది. జర్మనీలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రస్థాయిలో ఉంది . ప్రస్తుతం అక్కడ 7,00,000కు పైగా ఖాలీలు ఉన్నాయి. బెర్లిన్ కూడా భారతీయుల కోసం వార్షిక నైపుణ్యం కలిగిన కార్మికుల వీసాలను 20,000 నుండి 90,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలపై న్యూదిల్లీ దౌత్యపరంగా స్పందించింది. భారతదేశం 26 దేశాలతో వలసలకు సంబందించి 28 భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. 2026లో కుదిరిన భారత్-యూరోపియన్ యూనియన్ వలస ఒప్పందం, ఆ కూటమిలోని 27 సభ్య దేశాలలోని విద్యార్థులు, కార్మికులు , నిపుణులను కవర్ చేస్తుంది. అయితే, కాగితంపై ఉన్న ఒప్పందాలు, పనికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తితో సమానం కాదు. ప్రజలకు, మార్కెట్‌కు మధ్య అనుగుణ్యత ఇక్కడ ముఖ్యం. భారతీయ కార్మికులకు వాస్తవానికి ఈ మార్కెట్ల అవసరాలు తీర్చే నైపుణ్యం ఉన్నదా అన్నదే ప్రధాన ప్రశ్న.లేదనే దీనికి సమాధానం. అయితే ప్రైవేటుగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వెళ్లేవారు లేకపోలేదు.
కేరళ నర్సులు దీనికి ప్రామాణిక ఉదాహరణ. కుటుంబాలు సాధారణంగా ఏజెంట్ల ద్వారా , రుణాలు తీసుకుని, శిక్షణ, భాషా పరీక్షలు, సర్టిఫికేషన్, వీసాలు , ప్రయాణం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తాయి. ఇది భరించగలిగిన వారికి ఇది ఉపయోగిస్తుంది. ఇదే సమయంలో ఆ ఖర్చు, రిస్క్ మొత్తం ఆ వ్యక్తి భరించాల్సిందే. భారతదేశం నిజంగా ప్రతిభావంతులను అందించే దేశంగా ఉండాలని భావిస్తే, ఇది ఒక వ్యవస్థగా మారాలి.దీనికి సంబంధించి, ఈ క్రిందివి అవసరం. వృత్తి విద్యా కోర్సులలో భాగంగానే వృత్తిపరమైన భాష , సాంస్కృతిక శిక్షణను అందించడం, గ్రాడ్యుయేషన్ తర్వాత వాటిని విడిగా పొందకుండా చేయకుండా ఉండటం, విదేశీ నియంత్రణ సంస్థలు గుర్తించే ధృవీకరణ పత్రాలు, తద్వారా ఇక్కడ సంపాదించిన అర్హత అక్కడ కూడా ఆమోదం పొందేలా చూడటం, ఏజెంట్ ఆర్థిక వ్యవస్థ స్థానంలో నియంత్రిత, తక్కువ ఖర్చుతో కూడిన నియామకాలతో వీసా , ప్రయాణ సహాయం అందించడం, కొత్తగా వొచ్చిన వారికి గృహవసతి, ఉద్యోగాలు , సామాజిక సముదాయాన్ని కనుగొనడంలో సహాయపడే ప్రవాస భారతీయుల నెట్‌వర్క్‌లను గుర్తించడం. నర్సింగ్ రంగం ఏమి సాధ్యమో చూపిస్తుంది, కానీ అది అనధికారికంగా అభివృద్ధి చెందింది. పరిశ్రమలు , రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నడిపే జాతీయ నైపుణ్య-ఉద్యోగ కల్పన వ్యవస్థ, నర్సింగ్ రంగానికి అనధికారిక నెట్‌వర్క్‌లు చేసినట్లే ప్రతి రంగానికి చేయగలదు.
“భారతదేశంలోని శ్రామికశక్తి అవసరం ప్రపంచానికి ఉంది. యువ జనాభా వల్ల కలిగే ఒక సంతోషకరమైన ప్రభావంగా కాకుండా, వలసలను దాని ఖర్చులను లెక్కించి, ఉద్దేశపూర్వక జాతీయ వ్యూహంగా పరిగణించే ప్రణాళిక కొరవడింది. దీనిని సరిగ్గా చేస్తే, భారతదేశం ప్రపంచానికి కార్మికులను సరఫరా చేయగలదు. స్వదేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించగలదు. దీనిని అదృష్టానికి వొదిలేస్తే, అది ప్రధానంగా తన యువతను ఎగుమతి చేస్తుంది. వారు పంపిన డబ్బు ఉన్నంతకాలం స్వీకరిస్తుంది. రాబోయే దశాబ్దం ఈ రెండింటిలో ఏది జరుగుతుందో నిర్ణయిస్తుంది..”
ఇప్పుడు సంరక్షణ కార్మికులు, సాంకేతిక నిపుణులు, వెల్డర్లు, ఆతిథ్య సిబ్బంది , ఫ్యాక్టరీ కార్మికుల కోసం కూడా ఇదే వ్యవస్థను నిర్మించాల్సిన పని ఉంది. మరోవైపు పని: ఈ పనిలో రెండవ భాగం లక్షిత దేశాలతో ఉంటుంది. కార్మికులు అవసరమైన ప్రభుత్వాలు సరైన వారి కోసం త్వరగా చెల్లిస్తాయి. భారతదేశం ఒక భాగస్వామిగా చర్చలు జరపాలి, పిటిషనర్‌గా కాదు: ఉద్యోగ హామీలు, భారతీయ అర్హతల గుర్తింపు, దోపిడీ నుండి రక్షణ , శిక్షణ ఖర్చులో వాటా. జర్మనీ ఒప్పందం కారణంగా నైపుణ్యం గల కార్మికులను నియమించుకోవడానికి జర్మన్ చట్టపరమైన చట్రాన్ని స్వయంగా విస్తరించదని ఒక విశ్లేషణ పేర్కొంది. ఒక ఒప్పందం ఉద్యోగాలను సృష్టిస్తుందా లేక కేవలం పత్రికా ప్రకటనకే పరిమితమవుతుందా అనేది దాని అమలుకు సంబంధించిన వివరాలపై ఆధారపడి ఉంటుంది.
నియామక సంస్థలు, కార్యాలయాలను సంయుక్తంగా పర్యవేక్షించడం కూడా సహాయపడుతుంది, తద్వారా న్యూదిల్లీలో ఇచ్చిన హామీ ఒసాకా లేదా స్టట్‌గార్ట్‌లోని కర్మాగారాలలో నెరవేర్చబడుతుంది. దీనివల్ల భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందా? ఇదే అత్యంత కఠినమైన ప్రశ్న. ప్రధాన సంఖ్యలు ఆశాజనకంగా ఉన్నాయి. భారతదేశం 2020లో $83.2 బిలియన్ల నుండి 2024లో $137.7 బిలియన్ల రెమిటెన్సులను అందుకుంది.ప్రపంచ బ్యాంకు 2025 నాటికి ఈ సంఖ్యను సుమారు $150.7 బిలియన్లుగా అంచనా వేసింది. మరే ఇతర దేశం కూడా దీనికి దరిదాపుల్లో లేదు. కానీ, విదేశాల నుండి పంపే డబ్బు దేశానికి కలిగే లాభానికి ఒక బలహీనమైన కొలమానం మాత్రమే. గల్ఫ్ దేశాల నమూనా భారతదేశానికి బాగా పనిచేసింది, ఎందుకంటే అక్కడి కార్మికులు తమ స్వదేశాలకు తిరిగి వొస్తారు. వారు కొన్ని సంవత్సరాలు వెళ్లి, డబ్బు పంపి, చివరికి పొదుపు , అనుభవంతో తిరిగి వొస్తారు. యూరప్, అమెరికా , ఆస్ట్రేలియాలలో పద్ధతి భిన్నంగా ఉంటుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు ఒప్పందాలపై వొచ్చి, స్థిరపడి, తమ కుటుంబాలను తీసుకువొచ్చి, డబ్బు పంపడం ఆపేస్తారు. భారతదేశానికి కలిగే నష్టం శాశ్వతమైనది.
భారతదేశం తన సొంత ఖర్చుతో ప్రజలకు శిక్షణ ఇచ్చి, వారు విదేశాలలో స్థిరపడటాన్ని చూస్తూ ఉంటే, అది ఇతర దేశాల వృద్ధాప్య సమస్యలకు సబ్సిడీ ఇచ్చినట్లే అవుతుంది. కొంతమంది వ్యాఖ్యాతలు ఇప్పటికే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ నైపుణ్యాల కేంద్రంగా భారతదేశ పాత్రపై ఉన్న ఆశావాద దృక్పథం, నిశితంగా పరిశీలిస్తే విఫలమవుతుందని ఒక ఇటీవలి విశ్లేషణ హెచ్చరిస్తున్నది . ఈ సమతుల్యతను మార్చడానికి మార్గాలు ఉన్నాయి. కార్మికులు దేశాల మధ్య తిరిగే వలస విధానాన్ని ఒప్పందాలలో పొందుపరచవొచ్చు. ఆతిథ్య దేశాలు శిక్షణ ఖర్చులను పంచుకోవొచ్చు, తద్వారా భారతదేశం మాత్రమే పెట్టుబడిదారుగా ఉండదు.
నైపుణ్యాలను స్వదేశానికి తీసుకువొచ్చేవారికి తిరిగి వొచ్చేవారి కార్యక్రమాలు ప్రతిఫలాన్ని అందించగలవు. భారతదేశ జనాభా కూడా ఆలస్యంగానైనా వృద్ధాప్యంలోకి వెళ్తుంది కాబట్టి, అది తన హాస్పిటల్స్ , కర్మాగారాలు ,గృహాల కోసం తగినంత మంది శిక్షణ పొందిన వారిని నిలుపుకోవాలి. ఇది ఒక ఎంపిక, యాదృచ్ఛికం కాదు: భారతదేశంలోని శ్రామికశక్తి అవసరం ప్రపంచానికి ఉంది. యువ జనాభా వల్ల కలిగే ఒక సంతోషకరమైన ప్రభావంగా కాకుండా, వలసలను దాని ఖర్చులను లెక్కించి, ఉద్దేశపూర్వక జాతీయ వ్యూహంగా పరిగణించే ప్రణాళిక కొరవడింది. దీనిని సరిగ్గా చేస్తే, భారతదేశం ప్రపంచానికి కార్మికులను సరఫరా చేయగలదు. స్వదేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించగలదు. దీనిని అదృష్టానికి వొదిలేస్తే, అది ప్రధానంగా తన యువతను ఎగుమతి చేస్తుంది. వారు పంపిన డబ్బు ఉన్నంతకాలం స్వీకరిస్తుంది. రాబోయే దశాబ్దం ఈ రెండింటిలో ఏది జరుగుతుందో నిర్ణయిస్తుంది.
-‘మింట్ ‘ సౌజన్యంతో





