– హర్యానాలో దిగ్భ్రాంతికర ఘటన
చండీఘడ్, ఆగస్ట్ 24 : హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్తను చంపి అతడి పేగులు బయటకు తీసి దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంటి యజమాని చూశాడనే భయంతో భయాందోళనకు గురై ఇంటి పైకప్పు పైనుంచి కిందకు దూకేసింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో రాజేష్, విమలాదేవి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల రాజేష్, విమలా దేవి ఏదో విషయమై గొడవపడ్డారు. ఆ గందరగోళాన్ని విని ఇంటి యజమాని రింకు డాబా మీదకు పరుగెత్తాడు. అక్కడ అతడు చూసిన దృశ్యం అచ్చం క్రైమ్ సినిమాలోని సన్నివేశంలా ఉంది. రాజేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి శరీరం నుంచి బయటకు వచ్చిన పేగులను విమల ఒక సంచిలో పెడుతోంది. ఇంటి యజమానిని చూడగానే ఆ మహిళ భయాందోళనకు గురై టెర్రస్ పై నుంచి కిందకు దూకేసింది. గాయపడిన నిందితురాలిని హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పదునైన ఆయుధాలతో రాజేష్ కడుపును సుమారు 35 సెంటీమీటర్ల మేర కోసి లోతైన గాయాలు చేసినట్లు పోస్టుమార్టంలో తెలిసింది. ఘటనా స్థలం నుంచి మూడు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




