– ముగ్గురు నవజాత శిశువుల మృతి
ముంబై, ఆగస్ట్ 24 : మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా హాస్పిటల్‌లో మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్ మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అయితే, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో ఎల్‌ఎన్సీయూ మొత్తం వ్యాపించాయి. దీంతో పొగ పీల్చడం, తీవ్రమైన కాలిన గాయాలు కారణంగా ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది వార్డుకు చేరుకుని చిన్నారులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు నవజాత శిశువులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





