– దొంగ వోట్లు తొలగిస్తే భయపడాలా
– విపక్షాల తీరుపై మండిపడ్డ బీజేపీ నేత రామచంద్రరావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 11: సర్ ప్రక్రియపై బురదజల్లడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నామయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించా రు. ఎందుకంత భయమో చెప్పాలన్నారు. దొంగోట్లను తొలగించడం ఎన్నిక లసంఘం విధి అన్నారు. గతంలో ఎస్‌ఐఆర్ నిర్వహించినప్పుడు బీజేపీ మద్దతిచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం మాత్‌పల్లిలో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో రామచందర్‌రావు మాట్లాడారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ పక్రియ కొనసాగుతోందన్నారు. వోటు హక్కు ఉన్న ప్రాంతంలోనే వోటు వినియోగించేందుకు వీలు కల్పించడమే ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుండటంతో ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు అన్ని వర్గాలను మోసం చేశాయని ఆరోపించారు. వోటర్ల జాబితా ప్రక్షాళన కోసమే ఎస్‌ఐఆర్ పక్రియను నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ అమలులో ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





