– ఎంతటి వారైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే
– క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఎంతటి వారైనా సరే వారి వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్ద వద్దని నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లేకుంటే రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు ఆయన సూచించారు. గురువారం గాంధీ భవన్‌లో మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారన్నారు. కామారెడ్డిలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారన, షబ్బీర్ ఆలీకి నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆదివారం కమిటీ ముందు హాజరు కావాలని సూచించామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముందుగా షబ్బీర్ ఆలీ ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ చర్చిందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని మల్లు రవి వెల్లడించారు. పార్టీ వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించిన క్రమశిక్షణ కమిటీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని నేతలకు ఎంపీ మల్లు రవి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ చైర్మన్, ఎంపీ మల్లు రవిని కలిసి అన్ని విషయాలు వివరించానని పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నోటీసులపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చానన్నారు. అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. వారం రోజుల్లో అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రవి తెలిపారని, కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.