ప్రకృతి పంటలే మన ఆరోగ్యానికి రక్ష

– రసాయన పంటలతో రకరకాల రోగాలు
– రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి సంజయ్‌

‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 11: ‌దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. రసాయన ఎరువులతో పండించిన ఆహారం ప్రాణాలకు చేటుగా మారిందన్నారు. ప్రకృతి పంటలను పపండించి తింటేనే మన ఆరోగ్యానికి రక్ష అన్నారు. కరీంనగర్‌ ‌జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో పాలు తాగి 3 రోజులు ఆసుపత్రి పాలయ్యా. 20 ఏళ్లలో ఎప్పుడూ నాకు జ్వరం రాలేదు. బీపీ, షుగర్‌ ‌లేదు. నరేంద్ర మోదీయే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం.. భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది. రోగానికి కారకులం మనమే.. నివారించగలిగేది మనమే. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్జడెట్‌లో రూ.2,400 కోట్లు కేటాయించింది. ప్రకృతి వ్యవసాయం చేస్తే రెండు.. మూడేళ్లు లాభాలు రాకపోయినా, ఆ తర్వాత రైతులు కోటీశ్వరులవుతారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రైతులు గమనించి ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ముందుగా సేంద్రీయ సాగు చేసే వాళ్లు కోటీశ్వరులు కావొచ్చు. బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు యూరియాకు ఖర్చు చేస్తున్నాం. రూ.1.20 లక్షల కోట్ల సొమ్ము విదేశాలకు పంపి యూరియా దిగుమతి చేసుకోవడం బాధాకరం. రాబోయే రెండేళ్లలో కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.. ప్రకృతి వ్యవసాయంతో వచ్చిన పంటకు మద్దతు ధర ఇచ్చేలా చూస్తాం. మన దేశ సొమ్మును విదేశాలకు పంపి ఆయిల్‌, ‌బంగారం, ఎలక్టాన్రిక్‌ ‌వస్తువులను కొంటున్నాం. అందుకే మేక్‌ ఇన్‌ ఇం‌డియాతో స్వదేశీ ఉత్పత్తులను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్రమంత్రి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *