తంత్రీ వాయిద్యకారుడు రామయ్యకు పురస్కారం

– అభినందనలు తెలిపిన గ్రామస్థులు

పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్ 18: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన కడ్డీ తంత్రి వాయిద్య కళాకారుడు దురిచేటి రామయ్య కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పులి వెంకటేశంతోపాటు పలువురు రామయ్య ఇంటికి గురువారం వెళ్లి అవార్డుకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. నిరుపేద అయిన రామయ్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *