మహిళా శక్తి క్యాంటీన్‌ లో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు అయిన మొత్తం ఖర్చు, అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ వసతులు, మౌలిక సౌకర్యాల గురించి ఆ సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఉద్యోగులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ సరసమైన ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. అనంతరం క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన మెనూ బోర్డును పరిశీలించారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు చక్రపాణి, శివాజీ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *